Begin typing your search above and press return to search.

పార్ల‌మెంట్ స‌మావేశాలు: ఈ తీర్మానం చ‌ర్చ‌కు వ‌స్తుందా?

By:  Tupaki Desk   |   29 Jan 2020 3:30 PM GMT
పార్ల‌మెంట్ స‌మావేశాలు: ఈ తీర్మానం చ‌ర్చ‌కు వ‌స్తుందా?
X
ఎల్లుండి పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. జ‌న‌వ‌రి 31వ తేదీ నుంచి పార్ల‌మెంట్ స‌మావేశం కాబోతూ ఉంది. రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ ప్ర‌సంగంతో ఈ స‌మావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఈ స‌మావేశాల్లో వార్షిక బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్ట‌బోతున్నారు ఆర్థిక శాఖా మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్. అనంత‌రం బ‌డ్జెట్ పై చ‌ర్చ జ‌ర‌గ‌బోతూ ఉంది.

పార్ల‌మెంట్ స‌మావేశాల గురించి ఏపీ రాజ‌కీయంలో ఎంతో చ‌ర్చ జ‌ర‌గుతున్న సంగ‌తి తెలిసిందే. అందుకు ప్ర‌ధాన కారణం.. ఏపీ మండ‌లి ర‌ద్దు బిల్లు పార్ల‌మెంట్ లో చ‌ర్చ‌కు వ‌స్తుందా? రాదా? అనే అంశాలే!

ఏపీ శాస‌న‌మండ‌లిని ర‌ద్దు చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకుంది. ఆ నిర్ణ‌యాన్ని కేబినెట్ ఆమోదించింది, దానికి శాస‌న‌స‌భ ఆమోదం కూడా ప‌డింది. ఇక ఢిల్లీలో పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌లూ దాన్ని ఆమోదించిన అనంత‌రం, రాష్ట్ర‌ప‌తి సంత‌కంతో ఏపీ మండ‌లి ర‌ద్దు కాబోతోంది. ఏపీ శాస‌న‌స‌భ పంపించిన ఈ బిల్లును పార్ల‌మెంట్ ఆమోదించే అవ‌కాశాలే ఎక్కువ‌. అయితే ఎప్పుడు ఆమోదిస్తారు? అనేదే ప్ర‌శ్న‌!

ప్ర‌స్తుత బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలోనే ఈ బిల్లును చ‌ర్చ‌కు తీసుకురావాల‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అయితే పార్ల‌మెంట్ ముందు ఇలాంటి తీర్మానాలు చాలా వ‌ర‌కూ పెండింగ్ లో ఉంటాయ‌ని.. కాబ‌ట్టి ఏపీ ప్ర‌భుత్వం అనుకున్నా ఈ తీర్మానం అంత త్వ‌ర‌గా పార్ల‌మెంట్ లో చ‌ర్చ‌కు రాదు అని తెలుగుదేశం పార్టీ వాళ్లు అంటున్నారు. ఇలాంటి నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుంది అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారుతుంది.

తెలుగుదేశం పార్టీ విశ్లేష‌ణ నిజం అవుతుందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప‌ట్టుద‌ల నిజం అవుతుందా అనే అంశానికి పార్ల‌మెంట్ లో ఏపీ శాస‌న‌మండ‌లి ర‌ద్దు బిల్లు చ‌ర్చ‌కు రావ‌డం, రాక‌పోవ‌డ‌మే నిద‌ర్శ‌నం కాబోతోంది!