Begin typing your search above and press return to search.
సామర్ల కోట కుర్రాడికి రెండు కోట్ల జీతం
By: Tupaki Desk | 18 May 2017 6:30 AM GMTఓ తెలుగు కుర్రాడు సంచలనం సృష్టించాడు. తన సత్తాతో అమెరికాలో భారీ వేతనానికి ఉద్యోగాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రఖ్యాత యాపిల్ కంపెనీలో కొలువును సొంతం చేసుకున్న ఈ కుర్రాడు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వీకే రాయపురానికి చెందిన పోస్టాఫీసులో పని చేసే సుబ్బారావు.. సూర్యకుమారిల రెండో కుమారుడు దుర్గా లక్ష్మీ నారాయణ స్వామి అలియాస్ దిలీప్ ఇపుడు ఒక సంచలనం. టెన్త్ క్లాస్ లో 600 మార్కులకు 556 మార్కులు సాధించి.. ఇంటర్ లో వెయ్యికి 980 మార్కులు తెచ్చుకున్న ఇతగాడు.. బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్ లో ఓ ఉద్యోగంలో చేరాడు.
క్యాట్ లో 93.3 స్కోర్ సాధించిన దిలీప్.. అమెరికాలోని వర్జీనియా టెక్ లో ఎంఎస్ సీటు సొంతం చేసుకున్నాడు. ఈ మధ్యనే ఎంఎస్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఇతడు.. కాలిఫోర్నియాలోని ఐఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ లో జాబ్ ను సొంతం చేసుకున్నాడు. ఏడాదికి రూ.2 కోట్ల జీతానికి ఇతనికి ఉద్యోగం ఇచ్చేందుకు యాపిల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెల 22న జాబ్ లో జాయిన్ కానున్న దిలీప్‌కు ఆల్ ద బెస్ట్ చెబుదామా? తెలుగోడి సత్తా చాటిన దిలీప్ ను మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/