Begin typing your search above and press return to search.

సొంత సోదరుడిపై సీఎంకి ఫిర్యాదు చేసిన ఏపీ మంత్రి!

By:  Tupaki Desk   |   16 March 2020 11:30 PM GMT
సొంత సోదరుడిపై సీఎంకి ఫిర్యాదు చేసిన ఏపీ మంత్రి!
X
ఏపీలో ప్రస్తుతం రాజకీయం హాట్ హాట్ గా సాగుతుంది. ఒకవైపు కరోనా వేగంగా విస్తరిస్తుంటే ..అంతకంటే ఎక్కువ వేగంగా టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా వైసీపీలో జాయిన్ అవుతున్నారు. ఇక తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలని ఈసీ వాయిదా వేయడంతో దీనిపై ఇప్పుడు ఏపీలో పెద్ద దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీలో ఉన్న లుకలుకలు కూడా బయటపడుతున్నాయి. తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి తన సొంత సోదరుడి వ్యవహార శైలి పై సీఎం జగన్‌ కు ఫిర్యాదు చేసినట్లు వైసీపీ వర్గాలలో ఒక వార్త హల్ చల్ చేస్తుంది.

తన కంటే రాజకీయంగా సీనియర్ అయిన తన సోదరుడు - తనకి కాకుండా నాకు మంత్రి పదవి ఇవ్వడంతో - ఆ భాదని తట్టుకోలేక - అయన నాకు సహాయంగా కూడా ఉండటం లేదు అని, అలాగే నియోజకవర్గంలో తన ప్రభావం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆ మంత్రి సీఎం వద్ద మోర పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఇటీవల తన కుమారుడు జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేయడానికి నామినేషన్ వేస్తే దానిపై వివాదం సృష్టించారని - దానికి పరోక్ష కారణం తన సోదరుడే అని ఆ మంత్రి జగన్‌ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

మరోవైపు ఏపీ మంత్రివర్గంలో ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు వెళ్తుండడంతో ఖాళీ అవుతున్న ఉప ముఖ్యమంత్రి పదవి తన సోదరుడికి వస్తుందని ఆయన ప్రచారం చేసుకుంటున్నారని.. దాంతో తన వెనుక ఉన్న క్యాడర్ అయోమయానికి గురవుతున్నారని కూడా జగన్ వద్ద ఆయన అన్నట్లు తెలుస్తోంది.

కేబినెట్లోని మరో మంత్రి కూడా తన సోదరుడికే మద్దతు తెలుపుతూ తనపై కుట్రలు చేస్తున్నట్లు ఆ ఉత్తరాంధ్ర మంత్రి ఆరోపణలు చేసినట్లు చెప్తున్నారు. మంత్రిగా నేను ఏమి చేయలేదు అని - ఒక అసమర్థ మంత్రిగా నన్ను ..నిలబెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం కి చెప్తూనే - తాను ఏమేం చేశానో సీఎం కి వివరించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా పార్టీలో ఇప్పుడు ఈ ఉత్తరాంధ్ర వైసీపీ సోదరుల వివాదం చర్చనీయంగా మారింది. అయితే , పార్టీలో ఎటువంటి వివాదాలు లేవని - పార్టీలోని సీనియర్ నాయకులు ఈ వివాదాన్ని కప్పిబుచ్చుతున్నప్పటికీ ఈ అన్నదమ్ముల వివాదంపై పార్టీలో పెద్ద చర్చ జరుగుతుంది.