Begin typing your search above and press return to search.
ఏపీ మంత్రులకే నచ్చని తాత్కాలిక సెక్రటేరియట్
By: Tupaki Desk | 8 Aug 2016 9:49 AM GMTఏపీ మంత్రుల తీరు చూస్తుంటే రాష్ట్రం లోటులో ఉన్న వేళ తమ విలాసాలకు - తమ ఖర్చుకు ఢోకా లేకుండా చూసుకోవాలని అనుకుంటున్నట్లుగా ఉంది. హైదరాబాద్ - అమరావతి రెండు చోట్లా తమకు ఇంటద్దె కావాలని కోరుకుంటున్నది కొందరైతే.. ఇంకొందరు - వెలగపూడి సచివాలయంలో తమకు కేటాయించిన ఛాంబర్లు చాలవంటూ బయటకు అద్దెకు తీసుకుంటాం అని ప్రపోజల్ పెడుతున్నారు. దీంతో చెట్ల కింద కూర్చుని అయినా పనిచేస్తామని మొదట్లో చెప్పిన మంత్రులు ఇప్పుడిలా సౌకర్యాలు అంటూ అడ్డం తిరుగుతున్నారు.
సాధారణంగా మంత్రులు అద్దె ఇళ్లలో ఉంటే ప్రభుత్వం అద్దె చెల్లించడం చూశాం. కానీ ఏపీ మంత్రులు మాత్రం అటు హైదరాబాద్ ఇటు విజయవాడలోనూ తమ ఇళ్లకు అద్దె చెల్లించాలని పట్టుపడుతున్నారు. సీఎం చంద్రబాబుకు హైదరాబాద్ - విజయవాడలో మూడు నాలుగు చోట్ల ఇళ్లు - కార్యాలయాలు పెట్టుకుంటే నిధులు మంజూరు చేస్తున్న ఆర్థిక శాఖ తమకు మాత్రం ఎందుకు చేయకూడదని ప్రశ్నిస్తున్నారట. కొందరు మంత్రులైతే తాత్కాలిక రాజధానిలో ఎక్కువ సేపు పనిచేసే స్థాయిలో సౌకర్యాలు లేవంటున్నారు. మంత్రి నారాయణ పర్యవేక్షణలో సాగిన తాత్కాలిక సచివాలయంలో కొన్ని శాఖలకు కేటాయించిన గదులు చిన్నవిగా ఉన్నాయని మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇతర శాఖల మంత్రుల చాంబర్ల కంటే తమ చాంబర్లు చిన్నగా ఉండడం చూసి కొందరు మంత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. మంత్రి నారాయణపై కారాలుమిరియాలు నూరుతున్నారు. ఇలా తమ చాంబర్లు చిన్నగా ఉన్నాయన్న భావనకు వచ్చిన మంత్రులు… తాము విజయవాడ - గుంటూరులోని అద్దె భవనాల్లోనే ఉంటూ పనిచేస్తామని తేల్చిచెబుతున్నారు. వాటికి ప్రభుత్వమే అద్దె చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రులను చూసి అధికారులు కూడా అక్కడి సౌకర్యాలపై వంకలు పెడుతూ అడ్డం తిరుగుతున్నారు.