Begin typing your search above and press return to search.
ఆ విషయాల్లో బాబు ఎమ్మెల్యేలు అంత వీకా?
By: Tupaki Desk | 24 Oct 2016 6:14 AM GMT సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఏపీలో అధికారం చేపట్టిన తెలుగుదేశం ఎమ్మెల్యేలకు సంబంధించిన కొన్ని వ్యవహారాలు ఆసక్తికరంగా మారటమే కాదు.. నిజమా అనిపించేలా ఉన్నాయి. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా.. పలువురు తెలుగు తమ్ముళ్లకు ఎమ్మెల్యేలుగా ఏం చేయాలన్న విషయాల మీద క్లారిటీ లేదన్న మాట వినిపిస్తోంది.
కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారికి.. అవగాహన తరగతుల్ని ఏర్పాటు చేస్తారు. ఇది చాలవన్నట్లుగా.. పలు సందర్భాల్లో ఏపీ ముఖ్యమంత్రి తన పార్టీ నేతలకు రాజకీయ శిక్షణ తరగతుల్ని నిర్వహించటం మర్చిపోకూడదు. ఈ శిక్షణా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలుగా ఏమేం చేయొచ్చు. వారి పరిధి.. పరిమితుల వివరాలతో పాటు.. వారికుండే అధికారాల గురించి వివరంగా చెప్పటం కనిపిస్తుంది. మారుతున్న కాలానికి తగ్గట్లు తన పార్టీ నేతలు టెక్నికల్ గా సౌండ్ అని అనిపించేలా ఉండాలన్న తపన టీడీపీ అధినేత చంద్రబాబులో కాస్త ఎక్కువనే చెప్పాలి.
ఈ మధ్యనే నిర్వహించిన శిక్షణా తరగతుల్లో భాగంగా.. కేఎల్ యూనివర్సిటీలో డ్యాష్ బోర్డ్ విధానంపైనా.. కైజర్ యాప్ మీద అవగాహన కలిగించటంతో పాటు.. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను తన పార్టీ నేతలకు పరిచయం చేయటం.. వారికి మరింత అవగాహన కలిగించే ప్రయత్నం తెలిసిందే. ఇంత చేస్తున్నా.. పలువురు ఎమ్మెల్యేలకు తామేం చేయాలన్న అంశంపై అవగాహన పెద్దగా లేదన్న వాదన వినిపిస్తోంది.
ఎవరైనా సీనియర్ నేతల వద్ద పీఏలుగా.. పీఎస్ లు గా పని చేసే వారిని పిలిపించుకొని.. ఎమ్మెల్యేలుగా తామేం చేయొచ్చు? అన్న విషయాలతోపాటు.. ఎమ్మెల్యేలకు ఉండే వసతుల గురించి ఆరా తీయటం కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ఎమ్మెల్యేగా తామేం చేయొచ్చన్న అవగాహన కోసం తెలుగు తమ్ముళ్లు పడుతున్న తపన చూసినోళ్లంతా ముక్కున వేలేసుకునే పరిస్థితి. ఐదేళ్ల పదవీ కాలంలో సగం పూర్తి అయినా.. సబ్జెక్ట్ పరంగా మరీ ఇంత వీక్ గా ఉండటం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. తరచూ.. తన ఎమ్మెల్యేలపై సర్వే నిర్వహించే చంద్రబాబు.. ఇలాంటి విషయాల మీద కూడా అధ్యయనం చేయిస్తే మంచిదన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/