Begin typing your search above and press return to search.

ఏపీ ప్రతిపక్షాలకు ఇదేం మర్యాద..!!

By:  Tupaki Desk   |   16 Sep 2015 9:02 AM GMT
ఏపీ ప్రతిపక్షాలకు ఇదేం మర్యాద..!!
X
శత్రువైనా సరే ఇంటికొచ్చినప్పుడు మర్యాద కోసం ''బాగున్నారా'' అని పలకరిస్తాం... పిలిచి కూర్చోమంటాం... తాగడానికి మంచినీళ్లో, మజ్జిగో ఇస్తాం. కానీ... ఏపీలో ప్రతిపక్షాలు మాత్రం అలాంటి కనీస మర్యాదలు కూడా పాటించడం లేదు. పార్టీలు.. రాజకీయాలు ఎలా ఉన్నా రాష్ట్రానికి దేశవ్యాప్తంగా వచ్చిన గుర్తింపును కూడా వారు తట్టుకోలేకపోతున్నారు.

పారిశ్రామికంగా అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీకి 2వ స్థానమిచ్చింది ప్రపంచ బ్యాంకు. దీంతో దేశమంతా ఏపీవైపు చూసింది. ఇంతగౌరవం దక్కినా ఏపీలోని ప్రతిపక్షాలు మాత్రం కిక్కురమనలేదు. కనీస మర్యాద కోసమైనా దీనిపై సానుకూలంగా స్పందించలేదు.. హర్షం వ్యక్తం చేయలేదు.

అయితే... ఒకవేళ ప్రపంచ బ్యాంకు నివేదికలో ఏపీ స్థానం ఎక్కడో ఉండుంటే మాత్రం ఈసరికి ఏకిపారేసేవారు. కానీ, ఈ కొత్త గుర్తింపును మాత్రం ఏపీలో ప్రతిపక్షాలు జీర్ణం చేసుకోలేకపోయాయి. రాజకీయాల మాట ఎలా ఉన్నా రాష్ట్రం కోసమైనా వారు దీనిపై పాజిటివ్ గా స్పందించి... అవసరమైతే ఇది ఇలాగే కంటిన్యూ చేయాలంటూ తమవైపు నుంచి సూచనలు సలహాలు ఇస్తే ఎంతో గౌరవంగా ఉండేదేమో....? ఈ రాజకీయ పెద్దలకు పెద్దరికం ఎప్పుడొస్తుందో ఏమో..?