Begin typing your search above and press return to search.
ఆంధ్రోళ్లు అస్సలు అర్థం కారు.. తిట్టిన వేళలోనూ కేసీఆర్ కు పాలాభిషేకాలు
By: Tupaki Desk | 10 March 2022 4:54 AM GMTవిడిపోయి కలిసి ఉందామన్నది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన నిర్వహించిన ఉద్యమంలో కీలక నినాదం. నిధులు.. నీళ్లు.. నియామకాలు ఎలాగైతే ఉద్యమానికి కారణమైందో.. తెలుగువారు రెండు రాష్ట్రాలుగా విడిపోయి కలిసి ఉందామని తరచూ చెప్పేవారు. అలాంటిది విడిపోయి.. ఎవరి బతుకులు వారు బతకాలన్న మాటను అనుకున్న తర్వాత కూడా.. ఏపీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయటం.. విమర్శలతో ఉతికి ఆరేయటం లాంటివి కేసీఆర్ కు మాత్రమే చెల్లుతాయి.
అదే సమయంలో.. ఏపీ పాలకుల్ని.. ఏపీ నాయకుల్నితిట్టి పోసే సీఎం కేసీఆర్ కు పాలాభిషేకాలు చేయటం ఆంధ్రోళ్లకు మాత్రమే సాధ్యమని చెప్పాలి. రాష్ట్ర విభజన కారణంగా ఏపీ ఎంతగా నష్టపోయిందన్న విషయం తాజాగా తెలంగాణను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. విభజన వేళ తీసుకున్న నిర్ణయాలు.. ఆస్తుల పంపకాలు మొదలు.. పలు అంశాల విషయంలో ఏపీకి జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు.
కానీ.. ఈ విషయాన్ని సూటిగా చెప్పే ధైర్యం.. సాహసం ఉన్న నేతలు ఒక్కరంటే ఒక్కరు కూడా ఏపీలో లేకపోవటం ఆంధ్రోళ్లు చేసుకున్న బ్యాడ్ లక్ గా చెప్పక తప్పదు.
విడిపోయిన తర్వాత.. ఎవరి బతుకులు వారు బతికేస్తున్న వేళలోనూ.. నేటికి ప్రజల్లో సెంటిమెంట్ ను రాజేయటానికి ఆంధ్రోళ్లను తిట్టటం.. ప్రతి కీలక సందర్భంలోనూ ఏపీ పాలకుల్ని తిట్టిపోసే కల్చర్ ను కేసీఆర్ ఎంతలా పెంచి పోషిస్తుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగానే.. ఏపీ పాలకులకు అంత తెలివి ఉండి ఉంటే.. రాష్ట్ర విభజన జరగకుండా చక్రం తిప్పే వాళ్లు కదా?
కేసీఆర్ చెప్పినట్లుగా ఏపీ పాలకులు మస్తు కిరికిరిగాళ్లు అంటూ నోరు పారేసుకోవటం.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల్ని జోకర్లుగా.. విలన్లుగా చిత్రీకరిస్తూ సినిమాల్లో పాత్రల్ని డిజైన్ చేసే వారని.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందంటూ చేసే విష ప్రచారాన్ని తిప్పి కొట్టే తెలివి ఏపీ ప్రజలకు లేదనే చెప్పాలి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 90 వేల ఉద్యోగాల భర్తీకి ఓకే చెబుతూ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేయటం తెలిసిందే.
ఆయన నిర్ణయంపై పలువురు విద్యార్థులు.. తెలంగాణ యువకులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ మాటల్ని నమ్మలేమంటున్నారు. ఇదిలా ఉంటే.. దీనికి భిన్నంగా ఏపీలో మాత్రం పలువురు విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తూ.. ఏపీలోని జగన్ ప్రభుత్వం కూడా ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏమైనా.. తమ పాలకుల్ని అవసరం కోసం తిట్టి.. వారిపై సెటైర్లు విసిరి రాజకీయ లబ్థి పొందే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం చేసుడు ఒక్క ఆంధ్రోళ్లకే సాధ్యమవుతుందేమో? ఇదంతా చూసినప్పుడు.. ఆంధ్రోళ్లు అస్సలు అర్థం కారన్న భావన కలగటం ఖాయం.