Begin typing your search above and press return to search.
ప్రజాగ్రహం కనిపించట్లేదా బాబుగారూ?
By: Tupaki Desk | 2 Feb 2018 1:10 PM GMTకేంద్రం అన్యాయం చేసింది.. మనం కూడా రాజీనామాలు చేస్తే ఇక కేంద్రం నుంచి నిధులు సాధించేది ఎవరు? కేంద్రంపై ఒత్తిడిపెంచి మనకు రావాల్సింది దక్కించుకోవాల్సి ఉంది... ఇలాంటి మొక్కుబడి మభ్యపుచ్చే ప్రకటనలను కాలం చెల్లిపోయింది. కానీ నలభయ్యేళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు నారా చంద్రబాబునాయుడు ప్రజల్లో అసలు స్పందనను గమనించగల - పసిగట్టగల స్థితిలో ఉన్నారా? లేదా నలభయ్యేళ్ల కిందట తాను చూసిన ప్రజల్లాగానే ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ తానేం చెబితే అది గుడ్డిగా నమ్మేస్తున్నారనే భ్రమలో బతుకుతున్నారా? అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి.
ఎందుకంటే... బడ్జెట్ లో కేంద్రం ఏపీని వంచించిన తర్వాత.. గురువారం నాడు అందుబాటులో ఉన్న నాయకులతో భేటీ అయి.. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేసినా.. ఈ రోజు పెద్దసంఖ్యలో పార్టీ నాయకుల్ని జమచేసి.. అభిప్రాయాలు స్వీకరించడానికి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించినా.. చంద్రబాబునాయుడు తన అభిప్రాయాన్ని - సంయమనం అనే వైఖరిని తతిమ్మా వారి మీద రుద్దడానికి - వారిని తన మెతకతనానికి అనుగుణంగా ట్యూన్ చేయడానికి నిర్వహించినట్లే ఉన్నది గానీ.. వాస్తవంగా వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నట్టుగా లేదు.
ఏపీ ప్రజలు కేంద్రం చేసిన వంచన గురించి చాలా ఆగ్రహంగా ఉన్నారన్నది నిజం. రాష్ట్రప్రజల ప్రతినిధిగా - రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రజల్లో వెల్లువెత్తుతున్న భావోద్వేగాలను సరైన రీతిలో ప్రతిబింబించాల్సి ఉంది. ఏపీ ప్రజల ఆశలన్నీ తనమీదే ఉన్నాయని అంతర్జాతీయ వేదికలెక్కి డప్పు కొట్టుకోవడం కాదు... వారిలోని ప్రస్తుత ఆగ్రహానికి కూడా తానే ప్రతీకగా నిలవాలనే సంగతిని చంద్రబాబు గుర్తించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ఇలాంటి దుర్మార్గపు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన భారతీయ జనతా పార్టీ మీద.. తెలుగు ప్రజలు - ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ పౌరులు సహజంగానే మండిపడుతున్నారు. చంద్రబాబు ముందు ఇప్పుడు రెండే ఆప్షన్లు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే జనాల ఆగ్రహానికి నేతృత్వం వహించే నాయకత్వ పొజిషన్ లో ఉండి పోరాడాలి. లేదా.. ఆ జనాగ్రహాన్ని రుచిచూడడానికి ఏపీ భాజపాతో కలిసి ఛీత్కరింపులు భరించడానికి సిద్ధపడి ఎదురు నిల్చుకోవాలి. ఈ రెండు ఆప్షన్లలో ఆయన ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుందని పలువురు భావిస్తున్నారు.
కేంద్రంతో సంయమనం.. కేంద్రంతో సత్సంబంధాలు లేకుండా అభివృద్ధి కష్టం అంటూ మాటలు చెబుతున్న చంద్రబాబు తద్వారా అప్రకటిత రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటున్నారే తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలు - ప్రజల భావోద్వేగాలు చూడడం లేదని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.