Begin typing your search above and press return to search.
సొంత రాష్ట్రం చేత ఛీ అనిపించుకుంటున్న ఆంధ్రోళ్లు?
By: Tupaki Desk | 27 March 2020 3:30 PM GMTఅంతా చదువుకున్నోళ్లే. ఆ మాటకు వస్తే.. ఎవడికి వాడు ఉద్యోగాలు వెలగబెట్టేటోళ్లే. ఉన్న ఊళ్లో బతకటం ఇష్టం లేక.. హైదరాబాద్ కు వచ్చి జాబ్ చేస్తున్నాననే ఆంధ్రా ప్రాంతానికి చెందినోళ్లు..ఈ రోజు కరోనా కారణంగా ఇరవై ఒక్క రోజులు ఎక్కడివారు అక్కడ ఉండమని స్వయంగా ప్రధానమంత్రి చెప్పినప్పుడు ఏం చేయాలి? ఎలా వ్యవహరించాలి? అన్న విషయాల్ని మర్చిపోయి.. ఇంటికి వెళ్లాలన్న తపన తప్పించి.. తమ కారణంగా ఇంట్లోని వారు కరోనా కారణంగా ముప్పు వాటిల్లుతుందన్న చిన్న విషయాన్ని ఎందుకు మిస్ అవుతారన్నది పెద్ద ప్రశ్న.
చదువు లేనోళ్లు.. కరోనా మీద అవగాహన లేనోళ్లు అయితే అర్థం చేసుకోవచ్చు. అందుకు భిన్నంగా అన్ని తెలిసి కూడా కేవలం.. తమ ఇష్టాలు.. తమకు తోచినట్లుగా ఉండాలనే తపన మరీ ఇంతలానా? అన్నది ఇప్పుడు షాకింగ్ గా మారింది. హాస్టల్స్ వారు వెళ్లిపోవాలంటున్నారంటూ పోలీసు స్టేషన్ల వద్దకు వందలాదిగా చేరుకొని.. అనుమతి పత్రాలు తీసుకొని ఏపీ సరిహద్దుల్లోకి వెళ్లిన వారు..అక్కడి ప్రభుత్వం నో చెప్పేయటంతో ఆగ్రహానికి గురై వ్యవహరించిన తీరు.. సొంత రాష్ట్రానికి చెందిన వారే తిట్టిపోస్తున్న పరిస్థితి.
ప్రత్యేకమైన పరిస్థితుల్లో హెల్త్ ప్రోటోకాల్ ను పక్కన పెట్టేసి మరీ.. బరితెగిస్తున్న తీరు సరికాదంటున్నారు. ఏపీలోకి అనుమతించటం లేదన్న కోపంతో పోలీసుల మీద మూకుమ్మడి దాడి చేయటం.. రాళ్లు విసిరేయటం సరికాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. నిజానికి.. ఏపీ ప్రభుత్వం సైతం తమ సరిహద్దుల్లోకి వచ్చిన వారి విషయంలో పెద్ద మనసుతో కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా పద్నాలుగు రోజులు క్వారంటైన్ కు ఒప్పుకుంటే రాష్ట్రంలోకి అనుమతిస్తామన్న మాటను ఎందుకు ఒప్పుకోలేదన్నది ప్రశ్న.
ఎవరికి వారు వారి ఇష్టాలు.. సుఖాలు మాత్రమే ముఖ్యమనుకుంటే.. మిగిలిన వారి సంగతి ఏమిటి? కొన్ని వేల మంది కోసం కోట్లాది మంది ఆరోగ్యాల్ని పణంగా పెట్టాలా? అన్నది ప్రశ్న. ఎక్కడైనా సొంతోళ్ల చేత మాట అనిపించుకునే వరకూ వెళ్లరు. అందుకు భిన్నంగా.. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు కొందరు.. ఏపీ సరిహద్దుల్లో వ్యవహరించిన తీరుపై ఏపీ పోలీసులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇలా అయినోళ్ల చేత అనిపించుకునేంతలా వ్యవహరించటానికి మించిన దారుణం ఇంకేం ఉంటుంది?