Begin typing your search above and press return to search.

ఆంధ్రోళ్ల‌కు సిగ్గుంటే అలా చేయ‌ర‌ట‌!

By:  Tupaki Desk   |   30 Jan 2019 4:56 AM GMT
ఆంధ్రోళ్ల‌కు సిగ్గుంటే అలా చేయ‌ర‌ట‌!
X
ఉమ్మ‌డి రాష్ట్రం విడిపోయేలా ఉద్య‌మం చేసిన కేసీఆర్‌.. త‌న సుదీర్ఘ ఉద్య‌మంలో భాగంగా ఆంధ్రా ప్రాంతంలో ఏనాడు ప‌ర్య‌టించింది లేదు. తాము ఎందుకు విడిపోవాల‌నుకుంటున్న విష‌యాన్ని ఏపీ ప్ర‌జ‌లకు వివ‌రించింది లేదు. వారితో త‌న‌కు సంబంధం లేన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ఆంధ్రా ప్రాంతానికి వెళ్లేందుకు సైతం సుముఖ‌త వ్య‌క్తం చేసే వారు కాదు. ఆంధ్రా ప్రాంతంలో కూడా మీ గ‌ళాన్ని వినిపించండి. తెలంగాణ ఉద్య‌మంలో ఆంధ్రోళ్ల‌లో మీ మాట న‌చ్చిన వారితో క‌లిసి ఉద్య‌మించొచ్చు క‌దా? అని ఎవ‌రైనా చెబితే.. ఆంధ్రాకి వెళ్ల‌ట‌మా? అంటూ ప్ర‌శ్నించేవారు త‌ప్పించి సూటిగా స‌మాధానం ఇచ్చే వారు కాదు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు ఏపీకి ఒక‌టికి రెండుసార్లు అన్న‌ట్లుగా టూర్లు పెట్టుకుంటున్నారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కి సంబంధించిన టూర్ లో భాగంగా తొలుత విశాఖ‌కు వెళ్లి.. తానెంతో న‌మ్మే శార‌దా పీఠాధిప‌తిని ద‌ర్శించుకొన్నారు. ఈ సంద‌ర్భంగా బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ త‌ప్ప‌దంటూ చేసిన వ్యాఖ్య‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి.

తాజాగా చేసిన యాగం స‌క్సెస్ కావ‌టం.. ఏపీపై తాను గురి పెట్టిన నేప‌థ్యంలో అవ‌స‌రాన్ని సృష్టించుకొని మ‌రీ ఆంధ్రాకు వెళ్లేందుకు కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నార‌న్న మాట వినిపిస్తోంది. ఆస‌క్తిక‌ర ప‌రిణామం ఏమంటే.. కేసీఆర్ ఏపీ టూర్ ఆంధ్రోళ్ల మ‌ధ్య కొత్త వాద‌న‌ల్ని సృష్టించ‌ట‌మే కాదు.. వారి మ‌ధ్య హాట్ హాట్ వ్యాఖ్య‌ల‌కు కార‌ణంగా మారుతోంది. హైద‌రాబాద్‌ తో స‌హా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రా ప్రాంతం వారు కేసీఆర్ ఏపీ టూర్ పై స్పందించే క్ర‌మంలో.. ఆయ‌న ఫోటోల‌కు పాలాభిషేకాలు చేయ‌టాలు.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయ‌టాల‌పై కాసింత ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు.

హైద‌ర‌బాద్ కు చంద్ర‌బాబు వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న ఫ్లెక్సీ పెట్టే ఆలోచ‌నే చేయ‌ర‌ని.. అలాంటిది రాష్ట్రం ముక్క‌లు కావ‌టానికి కార‌ణ‌మైన కేసీఆర్ కు అలా ఫ్లెక్సీలు పెట్ట‌టం ఏమిట‌న్న ప్ర‌శ్న‌ను సంధిస్తున్నారు. ఇక‌.. ఆంధ్రా ప్రాంతంలోనూ కేసీఆర్ టూర్ హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ దేశంలో ఎవ‌రు ఎక్క‌డికైనా వెళ్లొచ్చు. అందులో భాగంగా కేసీఆర్ ఏపీకి రావ‌టంలో ఎలాంటి త‌ప్పు లేదు. కానీ.. ఆంధ్రోళ్లకు ఆత్మాభిమానం లేన‌ట్లుగా కేసీఆర్ వ‌స్తుంటే ఫ్లెక్సీలు.. బ్యాన‌ర్లు ఏర్పాటు చేయ‌టం.. పాలాభిషేకాలు లాంటివి చేయ‌టం క‌చ్ఛితంగా ఆంధ్రోళ్లు త‌మ‌ను తాము చుల‌క‌న చేసిన‌ట్లేన‌న్న వాద‌న వినిపిస్తోంది.

అన్నింటికి మించి మ‌రో కీల‌క విష‌యం ఏమంటే.. ఏపీలో త‌మ ముఖ్య‌మంత్రిని చూసేందుకు జ‌నాలు విప‌రీత‌మైన ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని.. కేసీఆర్ ఫోటోల‌కు పాలాభిషేకాలు చేస్తున్న వైనంపై తెలంగాణ ప్రాంతంలోని ప‌లువురు ముసిముసి న‌వ్వుల‌కు కార‌ణ‌మ‌వుతోంద‌న్న మాట‌ను ఆంధ్రా ప్రాంతానికి చెందిన ప‌లువురు త‌మ మాట‌ల్లో చెబుతున్నారు. గ‌తాన్ని వ‌దిలేస్తే.. ఏపీకి కేసీఆర్ మ‌ళ్లీ రానున్న నేప‌థ్యంలో ఆంధ్రోళ్ల ఆత్మాభిమానాన్ని అగౌర‌వప‌ర్చుకునేలా ఓవ‌రాక్ష‌న్ త‌గ్గించుకోవాల‌ని.. కేసీఆర్ రాక‌ను మిగిలిన వారి మాదిరే చూడాలే కానీ.. దాన్నో ఉత్స‌వ కార్య‌క్ర‌మంలా చేయ‌టం అంటే.. ఆంధ్రోళ్ల‌కు ఆత్మాభిమానం.. రోషం లేన‌ట్లుగా ఉంటుంద‌న్న మాట ఏపీలోని ప‌లువురి నోట వినిపిస్తోంది. ఇలాంటి వేళ‌.. కేసీఆర్ డైహార్ట్ ఫ్యాన్స్ గా చెప్పుకునే వారు ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.