Begin typing your search above and press return to search.
ఏపీ ప్రజలు ఉద్యమాలకు దూరమైపోయారబ్బా!
By: Tupaki Desk | 8 Feb 2020 2:30 PM GMTనవ్యాంధ్రప్రదేశ్ లో ఇప్పుడు నిజంగానే వింత పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే రాజధాని గానీ, ప్రత్యేక హోదా గానీ, ప్రత్యేక ప్యాకేజీ గానీ... ఇవేవీ పట్టని స్థితిలో జనం నైరాశ్యంలో మునిగిపోయారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి పట్టించుకునే ఆంద్రోళ్లు రాష్ట్రంలో అస్సలు కనిపించడం లేదు. తమ భవిష్యత్తు, తమ పిల్లల భవిష్యత్తు - తమ ఫ్యామిలీ ఫ్యూచర్ లను మాత్రమే ఆలోచిస్తున్న జనం... ఏపీ భవిష్యత్తు ఏమవుతుందన్న విషయాన్నే పట్టించుకోవడం మానేశారు. ఓ వైపు రాష్ట్రానికి మూడు రాజధానులు వద్దు... ఒక రాష్ట్రం-ఒక రాజధాని అంటూ టీడీపీ ఆధ్వర్యంలో రాజధాని రైతులు సాగిస్తున్న అమరావతి పరిరక్షణ ఉద్యమం హోరెత్తుతోందని టీడీపీ అనుకూల మీడియా బాకాలు ఊదుతోంది. మరో వైపు రాష్ట్రంలో వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని - అందుకు మూడు రాజధానుల ఫార్మ్యూలా ఒక్కటే మార్గమని వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీలు సాగుతున్నాయి. అయితే జనం మాత్రం ఈ రెంటినీ విస్మరించేశారు. ఈ రెండు రకాల కార్యక్రమాల్లో రెండు వర్గాలకు చెందిన జనం మినహాయిస్తే.. స్వచ్ఛందంగా రోడ్డెక్కుతున్న సామాన్య జనం అస్సలు కనిపించడం లేదు.
అటు రాజధాని అంశం గానీ, ఇటు ప్రత్యే హోదా విషయంపైగా జనం అస్సలు స్పందించకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. తెలుగు నేల విభజన జరిగి అప్పులతో కూడిన నవ్యాంధ్ర ఆవిర్భావం సందర్భంగా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీడీపీకి అధికారం కట్టబెట్టిన ఆంధ్ర ప్రజలు... ఆ తర్వాత అధికారం చేపట్టిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలతో విసుగు చెందారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తారని చంద్రబాబుకు ఓటేస్తే... ఆయనేమో ప్రత్యేక హోదా అవసరం లేదు...ప్రత్యేక ప్యాకేజీ చాలంటూ బహిరంగ ప్రకటనలు చేయడం, ప్రత్యేక హోదా అంటే జైల్లో పెట్టిస్తానని హెచ్చరికలు జారీ చేయడంతో జనం తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో తిరిగి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఉద్యమిస్తే.. జనం ఆయనను ఛీకొట్టేశారు. ప్రత్యేక హోదాపై స్పష్టమైన విధానంతో సాగిన జగన్ కు పట్టం కట్టారు.
అయితే ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నవ్యాంధ్ర రాజధానిగా బాబు ఎంపిక చేసిన అమరావతిలో పెద్ద ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న వార్తలు రావడంతో జనం షాక్ తిన్నారు. ఈ క్రమంలోనే ఏపీకి అమరావతితో పాటు మరో రెండు రాజదానులను ఏర్పాటు చేస్తామంటూ జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనపై జనం పెద్దగా స్పందించలేదు. ఈ ప్రతిపాదనపై అటు వ్యతిరేకంగా గానీ, ఇటు అనుకూలంగా గానీ జనం నుంచి స్పందన లేదనే చెప్పాలి. అంతేకాకుండా కొత్తగా రెండు రాజధానులు ఏర్పాటైతే... అమరావతి చచ్చినట్టేనని, రాజధానిని బతికించుకుందామంటూ టీడీపీ ఆధ్వర్యంలో రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమానికి కూడా జనం నుంచి పెద్దగా స్పందన లేదనే చెప్పాలి. రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో పాటు చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే ఈ ఉద్యమంలొో పాలుపంచుకుంటున్న వైనం బాగానే బయటపడింది.
అయినా జనం ఈ రెండు ఉద్యమాలను విస్మరించి ఏం చేస్తున్నారన్న విషయానికి వస్తే... కేవలం తమ కుటుంబాల భవిష్యత్తు గురించి మాత్రమే ఏపీ ప్రజలు ఆలోచిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే... అటు అమరావతి పరిరక్షణ ఉద్యమంలో పాలుపంచుకున్నా, ఇటు మూడు రాజధానులకు అనుకూలంగా ర్యాలీల్లో పాలుపంచుకున్నా... తమకు ఒరిగేది ఏమీ లేదన్న ఓ స్పష్టమైన అంచనాకు జనం వచ్చేశారు. ఈ రెండు ఉద్యమాలు కూడా ఆయా పార్టీల ప్రోత్సాహంతోనే సాగుతున్నాయి తప్పించి... ఏపీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాగుతున్నవి కాదన్న భావన జనంలో వచ్చేసింది. ఫలతంగా తాము పాలుపంచుకున్నా, దూరంగా ఉన్నా... ఆ ఉద్యమాల వల్ల తమకు నష్టం గానీ, లాభం గానీ లేదన్న భావనకు వచ్చేసిన జనం... తమ కుటుంబాలు, తమ పిల్లల భవిష్యత్తు ఏమిటన్న దానిపైనే దృష్టి సారించారని చెప్పాలి.