Begin typing your search above and press return to search.

ఆంధ్రాకు కేసీఆర్.. మరి బాబు ఏం కావాలి..

By:  Tupaki Desk   |   3 Sep 2018 6:51 AM GMT
ఆంధ్రాకు కేసీఆర్.. మరి బాబు ఏం కావాలి..
X
ప్రగతి నివేదన సభతో టీఆర్ ఎస్ జోరు మీదుంది..కేసీఆర్ కు రెట్టించిన ఉత్సాహం వచ్చింది. తెలంగాణ జనాలంతా గడిచిన రెండు మూడు రోజులుగా ఇదే జనసభ గురించి చర్చించుకుంటున్నారు. కేసీఆర్ ఏం చేశాడు. మళ్లీ వస్తే ఏం చేస్తాడనేదానిపైనే చర్చ అంతా.. ఇక్కడ సరే మరి ఆంధ్రాలో ఏం అనుకుంటున్నారు. ప్రగతి నివేదన ఎఫెక్ట్ ఆంధ్రాలో ఎంత.?

నిజానికి ఆంధ్రా జనాలకు కేసీఆర్ పై పీకల దాకా కోపం ఉండాలి కానీ అది లేదు. కేసీఆర్ పర్యటించిన రెండు మూడు సార్లు ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఈలలు కేకలు వేశారు. కరుడుగట్టిన విభజనవాది.. ఆంధ్రా విడిపోయి అన్యాయమైపోవడానికి కారణమైన వ్యక్తిపై ఏపీ ప్రజల్లో ఎందుకంత ప్రేమ పుట్టుకువచ్చిందంటే.. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే. అవును దేశం మొత్తం చెప్పుకునే పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి. పక్కనున్న ఏపీ ప్రజలను అవి ఆకట్టుకోవా.? అక్కడి సరిహద్దు ప్రాంతాల ప్రజలు కూడా తమకూ రైతు బీమా - రైతుబంధు పథకాలు కావాలనుకుంటున్నారు. కేసీఆర్ విడగొట్టి అభివృద్ధి చేస్తున్నాడు.. ఆయన కోణంలో రాష్ట్రం కోసం ప్రజల కోసం చేస్తుంది కరెక్టే.. అదే ఏపీ ప్రజలను ఆకర్సించింది. మన పాలకులు కేసీఆర్ లా పనిచేయాలని వారు కోరుతున్నారు. కేంద్రాన్ని నయానో భయానో అనునయించి సాధించాలని కోరుకుంటున్నారు. ఇప్పుడదే ప్రేమ ప్రగతి నివేదన సభ సాక్షిగా ప్రస్ఫుటంగా కనిపించింది.

కేసీఆర్ నిర్వహించిన ప్రగతి నివేదన సభకు మూడు రోజుల ముందుగా..6వేల మందితో కూడిన ఏపీ టీఆర్ ఎస్ అభిమానులు తరలివచ్చారు. ‘రావాలి రావాలి.. ఆంధ్రాకు కేసీఆర్ పాలన ’ అని రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శించారు. తెలంగాణలో కేసీఆర్ పాలన బాగుందని.. ఆయన ఏపీకి కూడా కావాలని విజయవాడకు చెందిన కొణిజేటి ఆదినారాయణ పేర్కొన్నారు. తమను ఎవరూ ప్రలోభ పెట్టలేదని.. సొంత ఖర్చులతో కేసీఆర్ పాలన ఇష్టపడి ఈ సభకు వచ్చామని తెలిపారు.

దీన్ని బట్టి బాబు పాలన అంటే తమకు నచ్చడం లేదని ఏపీ జనాలు స్పష్టం చేసినట్టే కనిపిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే కేసీఆర్ ఏపీకి వచ్చే అవకాశాలైతే లేవు. ఆయనకు తెలంగాణ అంటే ప్రాణం.. తెలంగాణ సమస్యలే ముఖ్యం.. తెలంగాణను ఫణంగా పెట్టి లో ఏపీలో కాలుమోపే అవకాశాలు లేనేలేవు. మరి బాబు పాలనపై బుసలు కొడుతున్న ఈ వ్యతిరేకత ప్రతిపక్ష వైసీపీకి అందివచ్చిన అవకాశం అనడంలో ఎలాంటి సందేహం లేదు. జగన్ పాదయాత్రకు వస్తున్న మైలేజ్.. బాబుపై వ్యతిరేకత దరిమిలా వచ్చే ఎన్నికల్లో ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందనేది హాట్ టాపిక్ గా మారింది. అభివృద్ధి - సంక్షేమాన్ని ఏపీ ప్రజలు కోరుకుంటున్నట్టు అర్థమవుతున్న వేళ అది జగన్ కు ఎంతో ప్లస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.