Begin typing your search above and press return to search.
ఇది ట్రైలరే అసలు సినిమా ముందుంది!
By: Tupaki Desk | 12 Sept 2016 10:31 PM ISTభారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుకు ఓ వెరైటీ అనుభవం ఎదురైంది. జనమంతా దాన్ని 'చేదు అనుభవం' అని అంటున్నారు. ఆయన విశాఖపట్టణంలో వెళుతుండగా, జనం ఆయన కారుకు అడ్డం పడ్డారు. ఘెరావ్ చేశారు. ప్రత్యేకహోదా కోసం పట్టుపడుతూ.. ఒక రకంగా ఆయనను నిర్బంధించారు. కదలనివ్వలేదు. పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కంభంపాటి హరిబాబు కారుకు అడ్డం పడిన వాళ్లను పక్కకు ఈడ్చేశారు. అరెస్టులు చేశారు. లాఠీలతో కొట్టారు. ఒకవైపు జిదంతా జరుగుతూ ఉంటే.. హరిబాబు మాత్రం కారులో కూర్చుని.. ప్రత్యేక హోదా కంటె ప్యాకేజీ చాలా మంచిది. రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది.. అంటూ చిలకలాగా పలికి తుర్రున వెళ్లిపోయారు.
అయితే జనం లో ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. కంభంపాటి హరిబాబుకు ఎదురైన అనుభవం.. ఏపీ రాష్ట్రంలో భాజపా వారి పట్ల ప్రజా స్పందనలో ట్రైలర్ పార్ట్ మాత్రమేనని.. అసలు సినిమా ముందుందని జనం వ్యాఖ్యానిస్తున్నారు. జనంలో భారతీయ జనతా పార్టీపై ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయనే వాదన బాగా వినిపిస్తోంది. వెంకయ్యనాయుడు కూడా ప్యాకేజీ ప్రకటించిన తర్వాత.. ఇప్పటి వరకూ ఏపీలో అడుగుపెట్టలేదు. అంతా హైదరాబాదులో కూర్చునే తన వాదనను మొత్తం సమర్థించుకుంటూ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో భాజపా నాయకులకు ఈ నిరసనలు ప్రస్తుతానికి ట్రైలర్ మాత్రమే అని, అసలు సినిమా ముందుందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.