Begin typing your search above and press return to search.

ఏపీలో అపహాస్యం.. టీడీపీ డబ్బులతో పోలీసులు

By:  Tupaki Desk   |   29 March 2019 5:43 AM GMT
ఏపీలో అపహాస్యం.. టీడీపీ డబ్బులతో పోలీసులు
X
టీడీపీ అక్రమాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి.. వైసీపీ ఆరోపించినట్టే పోలీసులను పావుగా మార్చి డబ్బులు పంచుతున్న వ్యవహారం మీడియా సాక్షిగా బయటపడింది.. డబ్బులు పంచి.. అక్రమాలు చేసి .. అరాచకాలు చేసి గెలవడానికి ప్రయత్నాలు చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది..

తాజాగా శ్రీకాకుళంలో టీడీపీ అక్రమ వ్యవహారాలు వెలుగుచూశాయి. ఎన్నికల సంఘం నుంచి తప్పించుకునేందుకు ఏకంగా పోలీసులనే రంగంలోకి దించారు టీడీపీ నేతలు.. పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష తరుఫున పోలీసులు డబ్బులు పంచుతున్న వ్యవహారం బయటపడింది. వజ్రపు కొత్తూరుకు చెందిన పోలీసులు టీడీపీ నేతలతో కలిసి ఓటర్లకు డబ్బులు పంచుతూ మీడియా కంటపడ్డారు.దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతోంది. టీడీపీ పోలీసులతో కుమ్మక్కై డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది.

ఇప్పటికే వైసీపీ నేతలు ఇటీవల శ్రీకాకుళం పోలీసుల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం ఎస్పీ టీడీపీ నేతలకు సహకరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన ఈసీ శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంను హెడ్ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.అయినా ప్రస్తుతం శ్రీకాకుళం పరిస్థితుల్లో మార్పు కానరావడం లేదని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రస్తుతం పోలీసుల అండదండలతో గెలవాలని చూస్తున్న టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను కూడా తొంగలో తొక్కుతోంది. పోలీసులను ఈసీ బదిలీ చేసినా దాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో టీడీపీ సవాల్ చేసింది. తమ అనుకూలమైన పోలీసులు లేకుంటే తమ పప్పులు ఉడకవని టీడీపీ చేస్తున్న ఎత్తులు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.