Begin typing your search above and press return to search.
తెలంగాణలో ఆంధ్రా పోలీస్ ఎన్నికల ప్రచారం!
By: Tupaki Desk | 27 Oct 2018 1:25 PM GMTఅందుగలడిందులేడను సందేహం వలదు....ఎందెందు వెదికిన అందు చంద్రబాబు అనుచరులు గలరు...ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు గోబెల్స్ ప్రచారం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పబ్లిసిటీకి పిచ్చెక్కించే చంద్రబాబు తెలంగాణలో ముందస్తు ఎన్నికల సందర్భంగా పబ్లిసిటీకి కొత్త నిర్వచనం చెప్పారు. ఇప్పటికే ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బందిని తెలంగాణలో మోహరించిన చంద్రబాబు...తాజాగా తెలంగాణలో విధులు నిర్వహిస్తోన్న ఏపీ పోలీసులను వాడేస్తున్నారు. తాజాగా చంద్రబాబు వాడకం బయటపడడంతో తెలంగాణ వాసులు మండిపడుతున్నారు. సైకిల్ గుర్తుకే మీ ఓటు అంటూ....ఏపీ పోలీసుల ద్వారా తెలంగాణలో చంద్రన్న ప్రచారం చేయిస్తోన్న వైనం బట్టబయలైంది. ఎవరి ఊహలకు అందకుండా....ఏకంగా పోలీసులతోనే ప్రచారం చేయిస్తోన్న చంద్రబాబు తెలివితేటలకు తెలంగాణ ప్రజలు అవాక్కయ్యారు.
ఎన్నికల సందర్భంగా పార్టీలన్నీ రకరకాలుగా ప్రచారం నిర్వహించడం సహజం. కానీ, 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవమున్న చంద్రబాబు....ఆ అనుభవంతో ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించారు. కరీంనగర్ జిల్లాలో ఓ ఏపీ పోలీసు...టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తోన్న వైనం చూసి పలువురు విస్తుపోయారు. ధర్మపురి ఆలయం దగ్గర ఓ వ్యక్తి గత మూడు రోజులుగా ఉంటున్న అక్కడి భక్తులు ఎవరికి ఓటు వేస్తారో కనుగొనే పనిలో పడ్డారు. కారు గుర్తుకు ఓటు వేయద్దని .. సైకిల్ గుర్తుకే మీ ఓటు అంటూ ఎన్నికల ప్రచారం మొదలెట్టారు. మొదట పెద్దగా పట్టించుకోని భక్తులు...అసలు ఆ వ్యక్తి ఎవరని ఆరా తీశారు. చివరకు అతగాడిని నిలదీయడంతో తాను ఏపీ పోలీసునని - రాజ్ భవన్ వద్ద విధులు నిర్వర్తిస్తుంటానని అంగీరించాడు. దీంతో, సదరు పోలీసుకి దేహశుద్ధి చేసిన భక్తులు....స్థానిక పోలీసులకు అప్పగించారు. ఇప్పటికే...ఇంటెలిజెన్స్ పోలీసులతో తెలంగాణ నేతల కూపీ లాగుతోన్న బాబు...తాజాగా సివిల్ పోలీసులను రంగంలోకి దించడం చర్చనీయాంశమైంది. ఇప్పుడే బాబు..ఈరకంగా ప్రవర్తిస్తే ...అధికారంలోకి వచ్చాక...ఇంకెలా ఉంటారో అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు.