Begin typing your search above and press return to search.
అఖిలప్రియను వదలని ఏపీ పోలీసులు
By: Tupaki Desk | 22 Oct 2019 8:00 AM GMTభూమా అఖిలప్రియ.. తెలుగు దేశం ప్రభుత్వంలో పర్యాటకశాఖ మంత్రిగా పనిచేశారు. వైసీపీలో గెలిచిన అఖిలప్రియ.. చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ కు గురై టీడీపీలో చేరి ఏకంగా మంత్రి అయ్యారు. అయితే మంత్రిగా భూమా అఖిలప్రియ పాలిస్తుంటే ఆమె భర్త మాత్రం కర్నూలు జిల్లాలో తెరవెనుక బాస్ గా చేసిన పనులు అన్నీ ఇన్నీ కావని ఆరోపణలున్నాయి. టీడీపీ హయాంలో అఖిలప్రియ ను - ఆమె భర్తను టచ్ చేసే సాహసం చేయని పోలీసులు తాజాగా వైసీపీ ప్రభుత్వం రావడంతో కొరఢా ఝలిపిస్తున్నారు.
అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ఆళ్లగడ్డలో ఓ క్రషర్ వ్యాపారిపై దాడి చేసిన కేసులో తప్పించుకు తిరుగుతున్నాడు. ఆయనను అరెస్ట్ చేసేందుకు తాజాగా ఏపీలోని ఆళ్లగడ్డ పోలీసులు హైదరాబాద్ లోని అఖిలప్రియ నివాసానికి వచ్చారు.
అయితే సెర్చ్ వారెంట్ లేదని.. వారెంట్ లేనప్పుడు ఇంట్లోకి ఎలా వస్తారని అఖిల ప్రియ అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు - అఖిలప్రియకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
అయితే ఇప్పటికే కేసుల్లో నోటీసులు పంపామని రాకపోవడంతో వచ్చామని పోలీసులు అఖిలప్రియకు తెలిపినట్టు తెలిసింది.