Begin typing your search above and press return to search.
ఏమైనా ఏపీ పోలీసులే ఏపీ పోలీసులు బాసూ!
By: Tupaki Desk | 26 Oct 2018 6:49 AM GMTమిగిలిన సంగతుల్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. అనుమానాల్ని తీసి పారేద్దాం. తెల్ల కాగితంలా ఉందాం. ఏపీ పోలీసుల్ని పూర్తిగా నమ్మేద్దామని ఎంత ఫిక్స్ అయినా.. వారు నోరు విప్పి చెబుతున్న మాటల్ని విన్నప్పుడు సవాలచ్చ సందేహాలు.. అనుమానాలు ముసరకుండా ఉండని పరిస్థితి. ఏదైనా ఒక పెద్ద నేరం జరిగినప్పుడు ప్రాధమిక సమాచారానికి.. నిందితుడ్ని విచారించిన తర్వాత వచ్చే నిజాలకు సంబంధించిన వ్యత్యాసం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది.
అదేం సిత్రమో కానీ.. జగన్ పై జరిగిన హత్యాయత్నం ఎపిసోడ్ లో ఏపీ పోలీసుల తీరు కామెడీగా ఉండటమే కాదు.. వేలెత్తి చూపించేలా ఉండటం గమనార్హం. ఎయిర్ పోర్ట్ లో జగన్ పై హత్యాయత్నం చేసిన నిందితుడికి సంబంధించి పోలీసులు చెబుతున్న అంశాలు మరిన్ని అనుమానాలకు గురి చేసేలా ఉంటున్నాయి.
ఏడు గంటల విచారణ తర్వాత.. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా.. నేరం జరిగిన వెంటనే వెలువడిన ప్రాధమిక సమాచారాన్నే.. అటు తిప్పి.. ఇటు తిప్పి చెప్పటంలో అర్థం లేదన్న విమర్శ వినిపిస్తోంది. జగన్ పై హత్యాయత్నం చేసిన కుర్రాడికి జగన్ అంటే చాలా ఇష్టమట. అందుకే కత్తితో హత్యాయత్నం చేశానని.. తాను చేసిన పనికి జగన్ పై సానుభూతి వెల్లువలా వస్తుందని.. ఆ ప్లాన్ తోనే తాను దాడి చేసినట్లుగా చెబుతున్నాడు.
వోకే.. పోలీసులు చెప్పిందే నిజమని అనుకుందాం. పెద్ద పెద్ద పోలీసు ఆఫీసర్లం కాకున్నా.. చిన్నపాటి లాజిక్ తో చూస్తే.. ఈ ఎపిసోడ్ గురించి విన్నంతనే మనసుకు కలిగే సందేహాల్ని చూద్దాం. వాటికి సంతృప్తికరంగా సమాధానాలు చెప్పేస్తే సరి.
+ ఎంత పెద్ద అభిమాని అయినా.. నేరాలకు అలవాటు లేని వ్యక్తి.. తాను విపరీతంగా అభిమానించి.. ప్రేమించే వ్యక్తి మీద దాడి చేయాలనుకుంటారా?
+ పోలీసులు చెప్పినట్లుగా నిందితుడు జగన్ ఫ్యాన్ అని అనుకుందాం. కానీ.. తన అభిమాన నేతను కత్తితో పొడవబోతున్నానన్న టెన్షన్ లేకుండా ఎలా ఉండగలిగాడు?
+ నవ్వుతూ ఎదురెళ్లి.. సెల్ఫీ అడిగి.. జేబులో నుంచి కత్తి తీసి మెడకు ఎందుకు గురి పెట్టినట్లు? సానుభూతి కోసం అంటే.. ఇంకెక్కడైనా కావొచ్చు కానీ.. కీలకమైన మెడ భాగాన్ని ఎందుకు టార్గెట్ చేసినట్లు?
+ పేరు.. కులం.. జగన్ కు కట్టిన ఫ్లెక్సీల గురించి అదే పనిగా చెబుతున్న పోలీసులు..కుర్రాడి మానసిక పరిస్థితి.. అతడి వెనుకున్న కుట్ర కోణం.. అతగాడు గడిచిన పది రోజులుగా ఎవరెవరితో మాట్లాడుతున్నాడన్న కాల్ డేటా కానీ.. వాట్సాప్ సంభాషణలు కానీ గుర్తించారా? వాటిని విశ్లేషించారా?
+ కత్తితో దాడి చేసిన వెంటనే ఏ విషయాల్ని అయితే పోలీసులు చెప్పారో.. ఆ తర్వాత అదే అంశం మీద నిలబడుతున్నట్లుగా పోలీసులు ఆ పాత విషయాల్నే కానీ.. కొత్త విషయాల్ని ఎందుకు ప్రస్తావించనట్లు?
+ నిందితుడి జేబులో లేఖ ఉందని చెప్పిన పోలీసులు.. దాన్ని విడుదల చేసే కన్నా.. అతడ్ని విచారించిన వీడియోక్లిప్పులను ఎందుకు ప్రచారంలోకి తెస్తున్నట్లు? ముందు నిందితుడి లేఖను ఎందుకు విడుదల చేయనట్లు?
+ ఇంటర్ మధ్యలో ఆపేసిన శ్రీనివాస్ అనే కుర్రాడు జగన్ అంటే తనకు పిచ్చ అభిమానమని.. ఆయన మీద సానుభూతి పొంగి పొర్లాలనే తాను కత్తితో పొడిచినట్లు చెబుతున్నారు. అంత అభిమానం ఉంటే..తాముఅభిమానిస్తున్న వారిపై కత్తులతో దాడులు చేస్తారా? సానుభూతి కోసమే ఇలా చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అభిమానం ఉన్నోళ్లంతా తమ అభిమానాన్ని చూపించేందుకు.. వారికి సానుభూతి తెచ్చేందుకు కత్తులు పట్టుకుంటారా? లాజిక్ గా వస్తున్న సందేహాలకు ఏపీ పోలీసులు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు?