Begin typing your search above and press return to search.
భార్యపై కన్ను.. భర్తకు వైసీపీ నేత బెదిరింపులు
By: Tupaki Desk | 17 Jun 2020 1:07 PM GMTభద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ వివాహితపై కన్నేశాడు పక్కరాష్ట్రం ఏపీలోని అధికార వైసీపీకి చెందిన యువనేత. ఆమెకు పెళ్లి అయ్యి నాలుగేళ్ల కొడుకు ఉన్నాడని తెలిసినా ఫేస్ బుక్ ద్వారా మాయమాటలు చెప్పి ఆమెను లోబరుచుకున్నాడు. ఆ మహిళతో సరసాలు ప్రారంభించాడు.
విషయం తెలిసిన ఆమె భర్త.. కోపంతో వైసీపీ నేతను నిలదీశాడు. దీంతో నీ అంతు చూస్తానని సదురు వైసీపీ నేత బెదిరించాడు. దీంతో వివాదం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ కు చెందిన ఒక ఆర్టిసీ కాంట్రాక్ట్ డైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి కొత్తగూడెంకు చెందిన యువతిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. కులాంతర వివాహం కావడంతో పెద్దలను ఎదురించి మరీ ఒక్కటయ్యారు. వీరికి నాలుగేళ్ల బాబు కూడా ఉన్నాడు.
ఇంతవరకు సాఫీగా సాగిన వీరి సంసారంలో ఫేస్ బుక్ ద్వారా వైసీపీ యువనేత చిచ్చుపెట్టినట్టు తెలిసింది. మాయమాటలు చెప్పి సదురు మహిళను లోబరుచుకున్న యువనేత ఏకంగా ఆమె ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు.
ఈ విషయం తెలుసుకున్న సదురు మహిళ భర్త.. యువనేత ని నిలదీశాడు. తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు. దీంతో రెచ్చిపోయిన ఆ యువనేత ఎదురుదాడికి దిగాడు. వివాహితతో చనువుగా ఉన్న ఫొటోలను ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు.
దీంతో వివాహిత భర్త రెండు రోజుల క్రితం బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో సదురు వైసీపీ నేతపై ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇరువర్గాలను పంపించివేశారు. దీంతో విషయం తెలుసుకున్న యువనేత అతడి భార్యతో కలిసి ఉడాయించాడు. ఇద్దరూ కలిసి తనను చంపాలని చూస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు.