Begin typing your search above and press return to search.

ముష్టెత్తుకోవడమా? హక్కు సాధించడమా?

By:  Tupaki Desk   |   25 Aug 2016 10:46 AM GMT
ముష్టెత్తుకోవడమా? హక్కు సాధించడమా?
X
ప్రత్యేక హోదా విషయంలో జనం తమను నానా మాటలూ తిడుతూ ఉంటే.. ఆత్మ వంచన చేసుకుంటూ అడ్డదారి కబుర్లు చెప్పడం.. ఏపీ భాజపా నాయకులకు వెన్నతో పెట్టిన విద్యలాగా మారిపోయింది. హోదాలో ఏముంది పెద్ద గొప్ప.. అంటూ వాళ్లు జనాన్ని బురిడీ కొట్టించడానికి చూస్తున్నారు. ఆ పాత్రను ఇప్పటిదాకా వెంకయ్య భుజాన మోశాడు గానీ.. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న హరిబాబు కూడా అదే పాట పాడుతున్నారు. ఆ పేరుకోసం పట్టుపట్టడం ఎందుకు? పేరు కావాలా? దానికి మించిన సాయం కావాలా? అంటూ.. అక్కడేదో తవ్వి తలకెత్తేస్తున్నట్లుగా మాయమాటలు చెబుతున్నారు.

ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ - 'మనకి పేరు కావాలా లేక దాని వల్ల వచ్చే నిధులు కావాలా అని ఏపి భాజపా అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అనడం చాలా విడ్దూరం గా వుంది. సహేతుకంగా జరగని మన రాష్ట్ర విభజనకి ప్రత్యేక హోదా అవసమని హరిబాబుకి తెలియదా. ప్రత్యేక హోదా వస్తే నిధులు వాటంతట అవే వస్తాయని వారికి తెలియదా! హోదా అంటూ ఉంటే.. పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఎగబడి వస్తారని ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారా? ఆ సౌలభ్యం వదులుకుని ప్రతి దానికి కేంద్రం ముందు ముష్టెత్తుకోడానికి మోకరిల్లాలని వారు ఉద్దేశమా. అని ప్రజలు భావిస్తున్నారు.

'కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలని అది వద్దనుకునేవారు తగువు పడాలని కోరుకుంటున్నారు' అని వారు సెలవిచ్చారు. ఇక్కడ ఎవరూ తగువు పడాలని కోరుకోవటం లేదు. కేంద్రం తన బాధ్యత గుర్తెరిగి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతున్నారు. 'ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రానికి ఏం లాభం' అని అమాకంగా ప్రశించడం హరిబాబు చిత్తశుద్ది ని - అవగాహనను శంకించే విధంగా వుంది. ఏం లాభం అనేది ఇప్పుదు తెలీక పోతే ప్రత్యేక హోదా ఇచ్చాక చూసి తెలుసుకోవడం మంచిది. అంతే గాని పది రాష్ట్రాలు అడుగుతున్నందున హొదా పేరు చెప్పకుండా లాభం ఏలా కల్పిద్దామని కేంద్రం ఆలోచిస్తుంది లాంటి పిచ్చి స్టేట్ మెంట్లు ఇవ్వడం మానేయాలి.

హోదా పొందడం అంటే మన హక్కు మనం సాధించుకున్నట్లు ఉంటుంది. మోదీ అనే వ్యక్తి ఉన్నా లేకపోయినా.. అన్నేళ్లపాటూ రాష్ట్రప్రగతి స్థిరంగా సాగుతూ ఉంటుంది. అలా కాకుండ సాయం అనే పేరు మీద.. వారిచ్చే ముష్టికి ఆశపడితే గనుక.. రాబోయే రెండేళ్లూ వారి అడుగులకు మడుగులొత్తుతూ ఉండాలి. ఎన్నికల్లో మోడీ సర్కారు పతనం అయిపోతే మన ఖర్మ కాలుతుంది. ఇవన్నీ హరిబాబు గారికి తెలియదా? లేదా, జనాన్ని బురి డీ కొట్టించడానికి తెలియనట్లుగా నటిస్తున్నారా?