Begin typing your search above and press return to search.
ఏపీలో వేర్వేరు పార్టీ నేతలంతా కుమ్మక్కు..!
By: Tupaki Desk | 15 Nov 2015 8:40 AM GMTఏపీకి సంబంధించి తాజాగా బయటకు వచ్చిన వ్యవహారం ఒకటి ఆసక్తికరంగా మారటమే కాదు.. రాజకీయ నేతల మధ్య ఐకమత్యం చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి. ఏపీలో మద్యం దుకాణాలకు సంబంధించిన ఒక నిజం బయటకు వచ్చింది. దాని ప్రకారం.. ఏపీలో మద్యం షాపులు నడపాలంటే..స్థానిక ఎమ్మెల్యేకు కనిష్ఠంగా 10 శాతం గరిష్ఠంగా 50 శాతం వరకూ లాభాల్లో వాటా ఇవ్వాల్సి ఉంటుందట. ఈ వాటాల వ్యవహారం ఒక్క అధికార పార్టీకే కాదు.. విపక్ష నేతలు సైతం తక్కువేమీ తినలేదని చెబుతున్నారు.
మద్యం షాపులకు సంబంధించి ఏ పార్టీ నేతలైనా సరే.. వాటా విషయంలో మాత్రం ఒకటే తీరుతో వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఈ మధ్యన ఏపీ ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాల్ని రద్దు చేయటం తెలిసిందే. అదేమంటే.. లాభాలుసరిగా రావటం లేదని.. ఆదరణ పెద్దగా లేదని చెబుతున్నారు. అయితే.. ఇదంతా రాజకీయ నేతల మాయగా చెబుతున్నారు. ప్రైవేటు వైన్ షాపులు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్దిల్లుతుంటే.. ప్రభుత్వ మద్యం దుకాణాలు మాత్రం సరిగా నడవకపోవటం ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై లోతుగా దృష్టి సారిస్తే ఆసలు విషయం బయటకు వస్తుందని చెబుతున్నారు.
రాజకీయంగా ఎన్ని విభేదాలు.. లెక్కలు తేడా ఉన్నప్పటికీ మద్యం వ్యాపారం విషయంలో మాత్రం కలిసికట్టుగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీలకు అతీతంగా లెక్కల ప్రకారం.. వివిధ పార్టీ నేతలు కలిసి సిండికేట్ పెట్టి మద్యం దుకాణాల్ని ప్రాంతాల వారీగా పంచుకుంటున్నారని.. బినామీల ముసులో వీరి పని బాగుందని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలన్నింటిలో ఎక్కువ భాగంగా పార్టీల ఎమ్మెల్యే హస్తం ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ ఉందని మర్చిపోకూడదని చెబుతున్నారు.
ఈ కారణంగానే మిగిలిన విషయాల సంబంధించి అధికారపక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే విపక్షాలు.. మద్యం దుకాణాల విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. దీనికి కారణం.. మద్యం దుకాణాల్లో అన్ని పార్టీల నేతలకు వాటాలు ఉండటంగా చెబుతున్నారు. నిజానికి ఇలాంటి చిత్రమైన రాజకీయం ఏపీలో తప్పించి మరెక్కడా కనిపించదని చెబుతున్నారు. రాజకీయం చేసుకోవటానికి ఎన్నో అంశాలు ఉన్నప్పుడు.. మద్యం విషయంలో కల్పించుకొని చేతికి వచ్చే నాలుగు రూపాయిల్ని ఎందుకు పోగొట్టుకోవాలన్న కాన్సెప్ట్ ఏపీలోని వివిధ పార్టీలకు చెందిన నేతల్లో కనిపించటం గమనార్హం.