Begin typing your search above and press return to search.
11 మార్కులు వచ్చినా.. టెన్త్ పాస్.. రీజన్ చెప్పిన ఏపీ ప్రబుత్వం
By: Tupaki Desk | 8 Jun 2022 2:11 AM GMTఏపీలో సోమవారం విడుదల చేసిన పదోతరగతి పరీక్షా ఫలితాల్లో రెండు లక్షల మంది టెన్త్ విద్యార్థులు ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఫలితాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ కూడా వచ్చింది. టీచర్లను ప్రభుత్వం మానసికంగా వేధించిందని, ఫలితాలు ప్రకటిస్తామన్న తేదీన కాకుండా మూడు రోజులు ఆలస్యం ఎందుకు జరిగిందనే ప్రశ్నలు కూడా వచ్చాయి. అమ్మఒడి వంటి కీలక పథకం భారం తగ్గించుకునేందుకే ప్రబుత్వం ఇలా చేసిందని కూడా ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ఇదిలావుంటే, ఇదే పరీక్షలో చాలా మంది విద్యార్థులను 11 మార్కులతోనే ప్రభుత్వం పాస్ చేసింది. దీనిపైనా కొన్ని విమర్శలు నెటిజన్ల నుంచి వ్యక్తమయ్యాయి. పరీక్షల్లో వాస్తవానికి పాస్ మార్కు 35గా ఉంటుంది. అయితే.. తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో విద్యార్థులు కేవలం 11, 17, 23 మార్కులు తెచ్చుకున్నప్పటికీ.. వారిని పాసైన వారి జాబితాలో చేర్చారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇది తీవ్ర అవకతవకలకు నిదర్శనమంటూ.. నెటిజన్లు సైతం హాట్ కామెంట్లు చేశారు. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. వెంటనే దీనిపై స్పందించింది.
ఇలా చేయడం కొత్త కాదని.. తక్కువ మార్కులు వచ్చిన అంటే.. 11, 17, 23 మార్కులు వచ్చిన వారిని కూడా పాస్ చేశామని.. ఇది గతంలోనూ జరిగిందేనని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇలా తక్కువ మార్కులు వచ్చిన వారంతా కూడా.. దివ్యాంగుల జాబితాలో ఉన్నారని.. వీరికి పాస్ మార్కుల నుంచి కొంత మేరకు మినహాయింపు ఉంటుందని.. ప్రభుత్వ అదికారులు వివరణ ఇచ్చారు. దీనిని తప్పుగా చూడాల్సిన అవసరం లేదని.. గతంలోనూ ప్రభుత్వాలు ఈ విధానాన్ని అనుసరించాయని.. ఇప్పుడే కొత్తగా తీసుకువచ్చిన విధానం కాదని పేర్కొన్నాయి. మరి దీనిపై ప్రతిపక్షాలు ఏమంటాయో చూడాలి.
ఇదిలావుంటే.. పదో తరగతి ఫలితాల్లో విషాదం చోటు చేసుకుంది. పెందుర్తి మండలం అప్పన్నపాలెంకు చెందిన విద్యార్థి పదో తరగతి ఫెయిల్ అవడంతో మేఘాద్రి రిజర్వాయర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పదో తరగతిలో రెండు సబ్జెక్ట్‌లు పోయాయని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన విద్యార్థి సాయి(15) ఇంటి నుంచి వెళ్లిపోయి మేఘాద్రి రిజర్వాయర్లో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈరోజు డ్యాంలో బయటకు తేలిన విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. విద్యార్థి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.