Begin typing your search above and press return to search.
ట్రైనీ ఐఏఎస్ లు ఉన్న రైల్లో మంటలు!
By: Tupaki Desk | 21 May 2018 9:58 AM GMTషాకింగ్ ప్రమాదం ఒకటి చోటు చేసుకుంది. ఏపీ ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ రైల్లో సాధారణ ప్రయాణికులతో పాటు ఏకంగా 36 మంది ట్రైనీ ఐఏఎస్ లు ప్రయాణిస్తున్నారు. ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
ఢిల్లీ నుంచి విశాఖ వస్తున్న ఏపీ ఎక్స్ ప్రెస్ బిర్లా నగర్ రైల్వే స్టేషన్ దాటిన వెంటనే ట్రైన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెను వెంటనే ఈ మంటలు నాలుగు బోగీలకు వ్యాపించాయి. అప్రమత్తమైన ప్రయాణికులు రైలు లో నుంచి కిందకు దిగేశారు. మంటలు రేగిన రైల్లో 36 మంది ట్రైనీ ఐఏఎస్ లు ఉన్నారు. ప్రమాదానికి కారణం ప్యాంట్రీ కారు ముందున్న బోగీలో షార్ట్ సర్య్కూట్ గా భావిస్తున్నారు. ఈ మంటలు బీ5.. 6.. 7 బోగీలకు వ్యాపించాయి.
మంటలు పెరిగే సమయానికి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు పూర్తిగా దగ్థమయ్యాయి.
ఏపీ ఎక్స్ ప్రెస్ కు సిగ్నల్ ఇవ్వకపోవటంతో ట్రైన్ బిర్లానగర్ స్టేషన్ వద్ద ఆగి ఉంది. ఆ సమయంలోనే అగ్నిప్రమాదం చోటు చేసుకోవటంతో పెను ప్రమాదం తృటిలో తప్పినట్లైంది. మంటల్ని గుర్తించిన ప్రయాణికులు తోటి ప్రయాణికుల్ని అప్రమత్తం చేస్తూ కిందకు దిగిపోయారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. షాకింగ్ గా మారిన ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు.