Begin typing your search above and press return to search.

లోక్ సభతోపాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.

By:  Tupaki Desk   |   4 Dec 2018 6:15 AM GMT
లోక్ సభతోపాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.
X
దేశంలో ఇప్పుడు ఎన్నికల కోలాహలం నెలకొంది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ మే నెల లోనే లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి. దాంతో పాటే ఆంధ్రప్రదేశ్ - ఒడిషా - సిక్కిం - అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

ఈ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం 2019, మే-జూన్ లోపు ముగిసిపోతోంది. వీటితోపాటు ఇటీవలే రద్దు అయిన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి కూడా సార్వత్రిక ఎన్నికలతో నిర్వహించేకు ఈసీ సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. దీనివల్ల భద్రత సులువవుతుందని.. లోక్ సభ ఎన్నికలకు ఉపయోగించే సెక్యూరిటీ తోనే జమ్ముకాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించవచ్చని ఈసీ యోచిస్తోంది.

ఇక మహారాష్ట్ర - హర్యాణా అసెంబ్లీలకు కూడా ఎన్నికలు మరో 10 నెలల్లోనే ఉన్నాయి. మరి వీటికి కూడా సార్వత్రిక ఎన్నికలతో జరపాలంటే అక్కడి అసెంబ్లీలు ముందస్తుగా రద్దు కావాల్సి ఉంటుంది. అది అక్కడి ప్రభుత్వాల పై ఆధారపడి ఉంటుంది. అయితే షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ఈసీ తెలుపుతోంది.

లోక్ సభ ఎన్నికలతో పాటు జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. నిజానికి తెలంగాణ ఎన్నికలు కూడా మే లోనే జరగాలి. కానీ కేసీఆర్ ముందస్తు కెళ్లి ముందుకు జరిపారు. ఇప్పుడు మేలో జరిగే ఎన్నికల్లో ఫుల్ ఫోకస్ మొత్తం ఏపీ పైనే కేంద్రీకృతం కానుంది. మరి డబుల్ పోరులో ఎవరి బలాలు ఏమిటన్నది వేచిచూడాల్సిందే..