Begin typing your search above and press return to search.
దిశ బిల్లుకు ఆమోదం.. జగన్ భావోద్వేగం
By: Tupaki Desk | 13 Dec 2019 11:04 AM GMTతెలంగాణలో దిశ హత్యోదంతం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుబట్టి తీసుకొచ్చిన ‘దిశ బిల్లు’కు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఏపీలో మహిళల భద్రతే ధ్యేయంగా జగన్ సర్కారు తెచ్చిన ఈ బిల్లును అధికార, ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి. ఈ ‘దిశ చట్టం’ ప్రకారం ఏపీలో అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష విధిస్తారు. 21రోజుల్లోనే తీర్పులను వెల్లడిస్తారు.
దిశ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం జగన్ భావోద్వేగానికి గురయ్యారు. ఏపీలో మహిళలపై దాడి చేయాలన్న ఆలోచన వస్తే వణుకు పుట్టేలా చట్టం తీసుకొచ్చామని తెలిపారు. దిశకు తగిన న్యాయం చేసిన తెలంగాణ పోలీసులకు - ప్రభుత్వానికి మరోసారి సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. నేరం చేస్తే కఠినశిక్ష పడుతుందనే భయం ఉంటేనే నేరాలు తగ్గుతాయన్నారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో క్రైమ్ రేట్ పెరిగిపోయిందని కేసులతో సహా జగన్ వివరించారు. అందుకే ఈ విప్లవాత్మక చట్టం తెచ్చానని తెలిపారు.
ఈ సందర్భంగా దిశపై అత్యాచారం - హత్య తప్పు అని అందరికీ తెలుసు అని.. కానీ సుప్రీం కోర్టు - మానవ హక్కుల సంఘాలు గొడవ చేస్తున్నాయని.. ఈ భయానికి ప్రభుత్వాలు - పోలీసులు కూడా చూసి చూడనట్లు ఊరుకుంటే దేశంలో అత్యాచారాలు పెరిగి అరాచకాలు పెచ్చరిల్లుతాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలో రేప్ చేస్తే చంపేస్తారని.. దానికి చప్పట్లు కొడుతామని..నిజం జీవితంలో మాత్రం విచారణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అనుభవాల నుంచే దిశ చట్టం తీసుకొచ్చామని జగన్ తెలిపారు. మన ఇంటి వారికి సమస్య వస్తే మనం ఎలా బాధ పడుతామో గుర్తించి చట్టాన్ని తెచ్చామని తెలిపారు.
ఇక ఈ కేసుల్లో సత్వర విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేస్తామని జగన్ తెలిపారు. మహిళల మీద దాడులు - సోషల్ మీడియాలో వేధింపులు - అత్యాచారాలు జరిగితే కోర్టులు తక్షణం శిక్షలు అమలు చేస్తాయన్నారు. సోషల్ మీడియాలో వేధిస్తే మొదటిసారి రెండేళ్ల జైలు - రెండోసారి అదే నేరానికి పాల్పడితే నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తామని తెలిపారు.