Begin typing your search above and press return to search.
దేశంలోనే ఏపీకి దక్కిన అరుదైన గౌరవం
By: Tupaki Desk | 27 Sep 2019 11:41 AM GMTఏపీ ప్రభుత్వానికి దేశంలోనే అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర పర్యాటక శాఖ 2017-18 సంవత్సరానికి ఇచ్చే జాతీయ పర్యాటక అవార్డుల్లో ఏపీ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవడం విశేషం.
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ అవార్డులను ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఆయా రాష్ట్రాలకు అందజేశారు. మొత్తం 76 అవార్డులను వేర్వేరు కేటగిరిల్లో వివిధ రాష్ట్రాలకు అందిస్తున్నారు. టూరిజం అభివృద్ధిలో దేశంలోనే నంబర్ 1 స్టేట్ గా నిలిచి బెస్ట్ స్టేట్ అవార్డును ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది.
ఏపీ తర్వాత గోవా, మధ్యప్రదేశ్ కలిసి అడ్వంచర్ టూరిజం కేటగిరిలో అవార్డ్ దక్కించుకున్నాయి. ఇక ఉత్తరాఖండ్ బెస్ట్ ఫిల్మ్ ప్రమోషన్-ఫ్రెండ్లీ రాష్ట్రంగా నిలిచింది. ఇక తెలంగాణకు ఓ అవార్డ్ దక్కింది. ఐటీని సరికొత్త వాడటంలో విన్నర్ గా నిలిచింది.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య మాట్లాడుతూ దేశంలో ఇప్పుడు టూరిస్ట్ లకు రెడ్ కార్పెట్ పరుస్తున్నామని.. ఇండియాలో వ్యాపారం తేలిక చేయడంతో ఎంతోమంది టూరిస్టులు దేశానికి వస్తున్నారని తెలిపారు.
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని.. టూరిజం ప్రదేశాల్లో కాలుష్యం లేకుండా చేయాలని రెండు రోజుల కిందటే ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన వేళ ఏపీకి టూరిజం అవార్డ్ దక్కడం విశేషం.