Begin typing your search above and press return to search.
రూ.2లక్షల కోట్లకు కాస్త తక్కువగా ఏపీ బడ్జెట్
By: Tupaki Desk | 8 March 2018 10:19 AM GMTమరో బడ్జెట్‌ను ఏపీ సర్కార్ పెట్టేసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం తన చివరి పూర్తిస్థాయి బడ్జెట్ (2018-19) ను ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో బడ్జెట్ వివరాల్ని వెల్లడించారు. గత బడ్జెట్ తో పోలిస్తే సుమారు 21 శాతానికి పైనే పెంపుదల ఉండటం విశేషం. భారీ ఎత్తున ఖర్చును ప్రతిపాదించిన బడ్జెట్ లో ఆదాయ మార్గాల విషయంలో అస్పష్టత కనిపిస్తోంది.
గడిచిన బడ్జెట్ల మాదిరే విభజన కష్టాల్ని ఏకరువు పెట్టిన ఆయన రాష్ట్ర పునర్నిర్మాణానికి సాయం అందటం లేదని.. విభజన కారణంగా రాష్ట్రం భారీ ఎత్తున ఆదాయాన్ని కోల్పోయిందన్నారు. రాజధాని నగరాన్ని కోల్పోవటం వల్ల తీవ్ర నష్టం వాటల్లిందన్నారు. విభజన చేసిన తీరు సరిగా లేని కారణంగానే సమస్యలు తలెత్తుతున్నట్లు చెప్పిన ఆయన.. కేంద్రం నుంచి సకాలంలో అందని సాయం కారణంగా సమస్యలు మరింత పెరుగుతున్నాయన్నారు.
సంక్షోభాల్ని అవకాశాలుగా మార్చుకొని ముందుకు వెళుతున్నట్లుగా చెప్పిన యనమల.. కేంద్రం సహకరిస్తే మరింతగా ముందుకెళ్లే అవకాశం ఉందన్నారు.
రూ.2లక్షల కోట్లకు కాస్త తక్కువగా (సుమారు రూ.9వేల కోట్లు) బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన యనమల.. రెవెన్యూ వ్యయాన్ని రూ.1.50 లక్షల కోట్లుగా చూపించారు. గత బడ్జెట్ తో పోలిస్తే 21.7శాతం పెరిగినట్లుగా పేర్కొన్నారు. మూడేళ్లలో జాతీయ సగటు వృద్ధిరేటు 7.30 శాతంతో పోలిస్తే.. రాష్ట్రం రెండంకెల వృద్ధిని సాధించిందన్నారు. నిరాశ..నిస్పృహల నుంచి ఆశలవైపు.. భ్రమల నుంచి విశ్వానం దిశగా రాష్ట్ర సర్కారు పయనిస్తోందన్నారు.
దాదాపు రూ.2లక్షల కోట్లకు దగ్గరగా ఉన్న బడ్జెట్ లో సాధారణ సేవల కోసం అత్యధికంగా రూ.51వేల కోట్లు కేటాయించగా.. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టుకు రూ.9వేల కోట్లు కేటాయించింది. విద్యారంగానికి రూ.24.1వేల కోట్లు కేటాయించింది. ఇక.. వ్యవసాయానికి గతం కంటే 35 శాతం అధికంగా రూ.12వేల కోట్లు కేటాయించగా.. సాగునీటి రంగానికి రూ.16.9వేల కోట్లను కేటాయించారు.
వివిధ వర్గాల సంక్షేమం కోసం భారీగా నిధులు కేటాయించారు. బీసీల అభివృద్ధి కోసం రే.12.2వేల కోట్లు కేటాయించగా.. కాపుల కోసం వెయ్యి కోట్ల రూపాయిల్ని కేటాయించారు. ఇక.. నాయిబ్రాహ్మణులు.. వైశ్యులు.. మేదరుల సంక్షేమానికి రూ.30 కోట్ల చొప్పున కేటాయించారు. కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం రూ.70 కోట్లు కేటాయించటం ద్వారా ఓటు బ్యాంకు రాజకీయాల విషయంలో తమ ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.
యనమల ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కీలక కేటాయింపులు చూస్తే..
బడ్జెట్ రూపం
మొత్తం బడ్జెట్: రూ.1,91,063.61 కోట్లు
రెవెన్యూ వ్యయం: రూ.1,50,270.99కోట్లు
మూలధన వ్యయం: రూ.28.678.49కోట్లు
= సాధారణ సేవల కోసం రూ.56,113.17కోట్లు
= విద్యా రంగానికి రూ.24,185.75కోట్లు
= వ్యవసాయ రంగానికి రూ.12,352కోట్లు.
= సాగునీటి రంగానికి రూ.16,978.23కోట్లు
= గ్రామీణాభివృద్ధికి రూ.20,815కోట్లు
= పోలవరం ప్రాజెక్టుకు రూ.9,000కోట్లు
= ఇంధన రంగానికి రూ.5,052.54కోట్లు
= రవాణా శాఖకు రూ.4,653కోట్లు
= రైతు రుణమాఫీకి రూ.4,100కోట్లు
= గృహ నిర్మాణ శాఖకు రూ.3,679కోట్లు
= పరిశ్రమల శాఖకు రూ.3,074.87కోట్లు
= క్రీడలు - యువజన సేవల శాఖకు రూ.1,635.44 కోట్లు
= కార్మిక - ఉపాధి కల్పనకు రూ.902.19కోట్లు
= సాంకేతిక విద్యకు రూ.818.02కోట్లు
= సమాచార - పౌర సంబంధాల శాఖకు రూ.224.81కోట్లు
= కళ - సాంస్కృతిక రంగానికి రూ.94.98కోట్లు
సంక్షేమం
+ బీసీ సంక్షేమానికి రూ.12,200కోట్లు
+ కాపుల సంక్షేమానికి రూ.1,000కోట్లు
+ మేదరుల సంక్షేమానికి రూ.30కోట్లు
+ నాయీ బ్రాహ్మణుల కోసం రూ.30కోట్లు
+ వైశ్యుల సంక్షేమం కోసం రూ.30కోట్లు
+ కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం రూ.70కోట్లు
వివిధ పథకాలకు
- చేతివృత్తులకు ఆదరణ పథకానికి రూ.750 కోట్లు
- చేనేతలను ప్రోత్సహించేందుకు జనతా వస్త్రాల పథకం కింద రూ.250కోట్లు
- జనతా వస్త్రాల సరఫరా కోసం రూ.200కోట్లు
- చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు రూ.100కోట్లు
- చంద్రన్న పెళ్లి కానుక కింద బీసీలకు రూ.100కోట్లు
- అన్న క్యాంటీన్ల కోసం రూ.200కోట్లు
- ఎన్టీఆర్ జలసిరి కోసం రూ.100కోట్లు
- నిరుద్యోగ భృతికి రూ.1000కోట్లు
- ఎన్టీఆర్ ఫించన్లకు రూ.5,000కోట్లు
- ఎన్టీఆర్ ఆరోగ్య సేవకు రూ.1000కోట్లు
- స్వచ్ఛభారత్ కోసం రూ.1,450కోట్లు
- సామాజిక భద్రత కోసం రూ.3,029కోట్లు
- ఆర్థికంగా వెనుకబడిన కులా విద్యార్థులకు బోధన ఫీజు కోసం రూ.700కోట్లు
- కాపు సామాజిక విద్యార్థులకు రూ.400కోట్లు
వివిధ శాఖలకు
* హోంశాఖకు రూ.6,226కోట్లు
* పర్యాటక శాఖకు రూ.290కోట్లు
* న్యాయశాఖకు రూ.886కోట్లు
* తాగునీరు - పారిశుద్ధ్యం కోసం రూ.2,623కోట్లు
* ఫైబర్ గ్రిడ్ కోసం రూ.600కోట్లు
* మెడ్ టెక్ జోన్ కోసం రూ.270కోట్లు
* స్టార్టప్‌ల కోసం రూ.100కోట్లు
* డ్వాక్రా మహిళలకు శానిటరీ న్యాప్‌కిన్ల కోసం రూ.,100కోట్లు
* వారానికి ఐదు రోజులు గుడ్లు పథకానికి రూ.266కోట్లు
* పౌష్టకాహార లోపం నియంత్రణకు రూ.360కోట్లు
* హిజ్రాల సంక్షేమానికి రూ.20కోట్లు
* విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు రూ.1,168కోట్లు
* గృహ నిర్మాణం-భూసేకరణకు రూ.575కోట్లు
* ఈ-ప్రగతికి రూ.200కోట్లు
* మెగా సీడ్ పార్క్ కోసం రూ.100కోట్లు
* చర్మకారుల జీవనోపాధి కోసం రూ.60కోట్లు