Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : రూ. 2, 24,789.18 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం !
By: Tupaki Desk | 16 Jun 2020 9:50 AM GMTఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్ ను (2020–21) ప్రవేశపెడుతోంది. మరోసారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ 2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో 2020-21 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది జగన్ సర్కార్. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.
అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితం చేసేలా బడ్జెట్ ను రూపొందించారు. అచ్చమైన తెలుగు కవితతో అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. ఆర్థిక మంత్రిగా రెండోసారి అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. 1,80,392 కోట్ల రెవెన్యూ వ్యయం, 44,396 కోట్ల మూలధన వ్యయంతో అంచనాతో ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.
ఇక కేటాయింపుల విషయానికొస్తే... వ్యవసాయానికి రూ. 11,891 కోట్లు, వైఎస్ఆర్ రైతు భరోసాకు రూ. 3,615 కోట్లు, ధరల స్థిరీకరణకు రూ. 3 వేల కోట్లు, వడ్డీ లేని రుణాల కోసం రూ. 1,100 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ. 1998.55 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ. 1,840 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి బుగ్గన ప్రకటించారు. ఎస్సీల సంక్షేమానికి రూ. 7, 525, కాపుల సంక్షేమానికి రూ. 2,845 కోట్లు, బీసీల సంక్షేమానికి రూ. 23,406 కోట్లు కేటాయించారు.