Begin typing your search above and press return to search.
ముగిసిన ఏపీ కేబినెట్.. నిర్ణయమిదే.?
By: Tupaki Desk | 27 Dec 2019 8:15 AM GMTఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం మధ్యాహ్నం 1.15 గంటలకు ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా మూడు రాజధానులపై చర్చ జరిగింది. జీఎన్ రావు నివేదిక తో పాటు స్థానిక ఎన్నికల పై జగన్ కేబినెట్ చర్చించినట్టు తెలిసింది.
కేబినెట్ మీటింగ్ ముగిసిన తర్వాత ఏపీ మంత్రి కన్నబాబు మీడియా కు వివరాలు వెల్లడించారు. రాజధాని తరలింపు పై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) నివేదిక వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఏపీ రాజధానిపై జీఎన్ రావు కమిటీ తో పాటు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపున కు కూడా జగన్ ప్రభుత్వం అధ్యయన బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి కే బీసీజీ గ్రూపు మధ్యంతర నివేదిక ను ఇచ్చింది. అయితే పచ్చటి భూముల్లో కంటే ( గ్రీన్ ఫీల్డ్) కంటే బీడు భూముల్లోనే ( బ్రౌన్ ఫీల్డ్) రాజధాని తోనే అభివృద్ధి సాధ్యమని బీసీజీ అందులో పేర్కొంది.
బీసీజీ నుంచి పూర్తి నివేదిక వచ్చాక ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుందని మంత్రి కన్నబాబు తెలిపారు. రాజధాని లోని ప్రాజెక్టు ల్లో సాంకేతిక అంశాల పైన బీసీజీ అధ్యయనం చేస్తోందని తెలిపారు.