Begin typing your search above and press return to search.
కేంద్రాన్ని ధిక్కరించారా ?
By: Tupaki Desk | 28 Jan 2022 4:32 AM GMTజరుగుతున్నది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఏపీలో కొత్త జిల్లాల పెంపుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిజానికి జిల్లాల పెంపు అన్నది ఎప్పుడో జరగాల్సిన విషయం. అయితే అప్పట్లో కొత్త జిల్లాల ఏర్పాటును వాయిదా వేసుకోమని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఎందుకంటే 2020లోనే జనాభా లెక్కల సేకరణ మొదలుపెట్టాల్సుంది. అయితే కరోనా వైరస్ కారణంగా ఆ పని మొదలు కాలేదు.
కరోనా వైరస్+కేంద్రం చెప్పటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లాల పెంపు కార్యక్రమాన్ని వాయిదా వేసిందన్నారు. మరిపుడు హఠాత్తుగా జిల్లాల సంఖ్యను ఎందుకు పెంచినట్లు ? జిల్లాల పునర్వ్యవప్ధీకరణ డ్రాఫ్ట్ ఎప్పుడో రెడీ అయిపోయింది. కాకపోతే ఇంతకాలం ప్రభుత్వం దాన్ని బయట పెట్టలేదు. అలాంటిది కరోనా వైరస్ కేసులు ఒకవైపు పెరుగుతున్నాయి. మరోవైపు కేంద్రం చెప్పిన జనాభా లెక్కల సేకరణ ఇంకా మొదలు కాలేదు. ఇంతలోనే ప్రభుత్వం మాత్రం జిల్లాల సంఖ్యను పెంచేసింది.
మరి దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందా ? అన్నదే డౌటుగా ఉంది. ఎందుకంటే జిల్లాల సంఖ్య పెంచితే కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకోవచ్చని కేసీయార్ కూడా జిల్లాల సంఖ్యను పెంచారు. మరి కేసీయార్ ఆశించినట్లుగా నిధులేమన్నా ఎక్కువచ్చాయా ? అదనపు నిధుల విషయాన్ని పక్కన పెట్టేస్తే కేసీయార్ కు రాజకీయ ప్రయోజనాలు మాత్రం సిద్ధించినట్లున్నాయి. జిల్లాల సంఖ్యను పెంచటం వెనుక అధికార పార్టీకి ప్రధానంగా రాజకీయ ప్రయోజనాలే ఎక్కువుంటాయి.
జగన్ కు ఇప్పటికిప్పుడు సిద్ధించాల్సిన రాజకీయ ప్రయోజనాలు కూడా ఏమీ లేవు. కరోనా వైరస్ సమస్యున్నా జగన్ ఎందుకని జిల్లాల సంఖ్యను పెంచారు. కేంద్రం వద్దన్న తర్వాత కూడా జిల్లాల సంఖ్యను పెంచటమంటే లోపాయికారీగా అనుమతన్నా తీసుకునుండాలి. లేకపోతే కేంద్రాన్ని ధిక్కరించటానికి సిద్ధపడుండాలి. మరీ రెండింటిలో ఏది నిజమో తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేస్తే అర్థమైపోతుంది. చూద్దాం చివరకు ఏమవుతుందో.