Begin typing your search above and press return to search.
పరీక్షలు వేలల్లో కేసులు వందల్లో: ఏపీలో కొత్తగా 611 పాజిటివ్
By: Tupaki Desk | 1 July 2020 12:20 PM GMTవైరస్ నిర్ధారణ పరీక్షలు వేలల్లో చేస్తుండగా కేసులు మాత్రం వందల్లో నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వైరస్ ఉధృతి ఒకే స్టేజీలో ఉంది. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా టెస్టులు భారీగా చేస్తున్నారు. ఆ చేస్తున్న టెస్టుల్లో ఐతి తక్కువగా పాజిటివ్ తేలుతున్నాయి. తెలంగాణతో పోలిస్తే ఏపీలో చాలా మెరుగైన పరిస్థితులు ఉన్నాయి. తాజాగా ఒక్కరోజే 28,239 పరీక్షలు నిర్వహించగా 657 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,5252కు చేరింది.
తాజాగా వైరస్ తో బాధపడుతూ ఆరుగురు చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 193కి చేరింది. వైరస్ బారినపడి చికిత్స పొంది కోలుకున్న 342మంది డిశ్చార్జయ్యారు.
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా అనంతపురము జిల్లాలో 118, కర్నూలు 90, తూర్పుగోదావరి 80, గుంటూరు 77, వైఎస్సార్ కడప 60, కృష్ణా 52, చిత్తూరు 35, నెల్లూరు 33, ప్రకాశం 28, విశాఖపట్నం 21, పశ్చిమగోదావరి 15, విజయనగరం 2 కేసుల చొప్పున నమోదయ్యాయి.
రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో మొత్తం 2045 పాజిటివ్ కేసులు ఉండగా అనంతపురము జిల్లాలో 1,689 ఉన్నాయి. మూడో స్థానంలో కృష్ణా జిల్లాలో 1,519 కేసులతో ఉంది.