Begin typing your search above and press return to search.
వావ్...! ఏపీకి అప్పు దొరికింది!!
By: Tupaki Desk | 14 May 2022 12:16 PM GMTఅప్పులేని వాడు అధిక సంపన్నుడు.. అని ఎవరు అన్నారో కానీ.. అది పాత చింతకాయ్ తరహా ఆలోచన. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. ఈ కాలంలో ఎవరు ఎంత ఎక్కువ అప్పు పుట్టించుకుంటే.. వారు.. అంత అధిక సంపన్నులన్న మాట! ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. అప్పుల కోసం.. రాష్ట్రాలు కేంద్రం ముందు మోకరిల్లుతున్నాయి. ''అప్పో.. మోడీ ప్రభో!!'' అంటూ.. ఢిల్లీ వీధుల్లో ఆర్థిక మంత్రులు చక్కర్లు కొడుతున్నారు. అయితే.. వీరిలో ఎవరినీ కరుణించని.. మోడీ ప్రభువు.. ఏపీ రాజును దయదలిచారు!
ఏపీ రాజు అప్పులు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. మరి ఇంతకన్నా.. ఏపీకి కావాల్సింది ఏంటి? పొరుగు రాష్ట్రం తెలంగాణ, పక్కరాష్ట్రం తమిళనాడు, ఆఖరుకు బీజేపీ పాలిత కర్ణాటక విషయంలోనూ కరుణించని.. కేంద్రం.. ఏపీ విషయంలో కరుణ కరిపించడం.. వావ్!! అనిపించక ఏమనిపిస్తుంది!! ఇప్పుడు అదే జరుగుతోంది. అభివృద్ధి విషయంలో పొరుగు రాష్ట్రాలకు కన్ను కుట్టేలా.. తన పాలన ఉందో లేదో సీఎం జగన్ లెక్క చూసుకోక పోయినా.. అప్పుల విషయంలో మాత్రం.. పొరుగు... పక్క రాష్ట్రాలకు ఒక్క కన్నేంఖర్మ.. అన్నీ కుట్టేలా... ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారని.. పక్క రాష్ట్రాలు ఉడుకెత్తిపోతున్నా యి.
ఏం జరిగింది?
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం గత మూడేళ్లలో చేసిన అప్పుల కారణంగా కొత్త అప్పులకు అనుమతిచ్చేది లేదని భీష్మించిన కేంద్రం.. ఎట్టకేలకు రాజకీయ ఒత్తిడికి తలొగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.80 వేల కోట్లు అప్పులు కావాలని జగన్ ప్రభుత్వం కోరగా.. కేంద్రం మాత్రం రూ.28 వేల కోట్లకు అనుమతిం చింది. అనుమతి వచ్చిన వారంలోనే రూ.5 వేల కోట్ల అప్పులు చేసింది వైసీపీ ప్రభుత్వం.. నెలకు రూ.5-6 వేల కోట్లు అప్పులు తెస్తే గానీ రాష్ట్రంలో గడవని పరిస్థితి.
ఈ నెల 17న రూ.2 వేల కోట్లు అప్పులు తెచ్చిన తర్వాత ఈ నెల పూర్తవడానికి మరో 13 రోజులు ఉన్నందు న ఇంకో రూ.2 వేల కోట్లు అప్పు తెచ్చే అవకాశం కనిపిస్తోంది. మే 17న ఆర్‌బీఐ నిర్వహించే సెక్యూరిటీ వేలంలో పాల్గొని మరో రూ.2 వేల కోట్ల అప్పు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే 10న జరిగిన వేలంలో రూ.3 వేల కోట్లు అప్పు తెచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) ప్రారంభమైనప్పటి నుంచి ఈ నెల 17 వరకు అంటే 47 రోజుల్లో సర్కారు రూ.9,390 కోట్లు అప్పు తెచ్చింది.
తెలంగాణకు మొండిచేయి..
ఏపీ మాదిరిగానే అప్పులు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణకు కేంద్రం నుంచి ఎలాంటి సహ కారం అందడం లేదు. ఇప్పటికే ఆర్థిక అధికారులు.. సీఎస్ సహా.. అందరూ.. ఢిల్లీ చుట్టూ తిరిగారు. కానీ, ఫలితం కనిపించలేదు. దీంతో.. అప్పులు తెచ్చుకునే నేర్పులో జగన్ ప్రభుత్వంముందు వరుసలో ఉందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఏదేమైనా.. అభివృద్ధి లేకున్నా.. అప్పులు తెస్తున్నారుగా!! అంటున్నారు.