Begin typing your search above and press return to search.
ఏపీలో 133 హాట్ స్పాట్స్ .. ఆ ప్రాంతాలన్నీ అష్టదిగ్భంధం !
By: Tupaki Desk | 11 April 2020 6:15 AM GMTఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. దేశంలోని వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న 10 రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటి. శనివారం ఉదయం మరో ఐదుగురికి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 386కు చేరుకుంది. కొత్త కేసులు కర్నూలులోనే నమోదయ్యాయి.రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, పాజిటివ్ తీవ్రతతో మృతి చెందినవారు నివాసం ఉన్న ప్రాంతాలను హాట్ స్పాట్స్ గా గుర్తించిన పోలీసు అధికారులు ఆయా ప్రాంతాలను అష్టదిగ్బంధం చేశారు.
మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు 133 ప్రాంతాలను హాట్ స్పాట్స్ గా ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో అత్యధికంగా నెల్లూరులో 30 ప్రాంతాలు, కర్నూలులో 22, కృష్ణా జిల్లాలో 16, గుంటూరులో 12, ప్రకాశంలో 11, పశ్చిమ గోదావరి జిల్లాలో 12 ప్రాంతాలను గుర్తించారు. అసలు రెడ్ జోన్లు లేని జిల్లాలుగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు నిలిచాయి. విజయవాడలో కుమ్మరిపాలెం, విద్యాధరపురం, పాత్ ఆర్ ఆర్ పేట, కృష్ణలంక రాణీగారితోట, ఖుద్దూస్ నగర్, పాయకాపురం, శాంతినగర్, కానురు ప్రాంతాలను రెడ్ జోన్లుగా పరిగణించారు. ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు పోలీసులు ఎవర్నీ అనుమతించడం లేదు. అక్కడ నివసించే వారికీ ఏ అవసరం వచ్చినా కూడా అధికారులే అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా రెడ్ జోన్లలో పరిస్థితిని విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు.
మచిలీపట్నంలో కలెక్టర్ బంగ్లా, చిలకలపూడి సెంటర్ , కొబ్బరితోట, నవీన్ మిట్టల్ కాలనీ, చిలకలపూడి రైల్వే గేట్, లక్ష్మణరావు పురం రోడ్ ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఆయా ప్రాంతాలకు కొత్తవారిని పోలీసులు అనుమతించడం లేదు. కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు ఆయా రెడ్ జోన్ల ప్రాంతాలను పరిశీలించి అక్కడ విధుల్లో ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి జోన్‌లో ఎస్‌ఐ ఇన్‌చార్జిగా ఆ ప్రాంత విస్తీర్ణాన్ని బట్టి 10 నుంచి 20 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరినీ బయటకు రానీయడం లేదు. కేసుల ఉదృతి పెరుగుతున్న నేపథ్యం లో ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.