Begin typing your search above and press return to search.

ట్రాఫిక్ ఉల్లంఘనులకు ఏపీ సర్కారు షాక్

By:  Tupaki Desk   |   29 Aug 2019 6:16 AM GMT
ట్రాఫిక్ ఉల్లంఘనులకు ఏపీ సర్కారు షాక్
X
భరత్ అనే నేను సినిమాలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే 20వేల ఫైన్ విధిస్తాడు మహేష్ బాబు.. ఇప్పుడు కేంద్రం తెచ్చిన కొత్త ట్రాఫిక్ నిబంధనల చట్టంతో డ్రంకెన్ డ్రైవ్ కు 10వేల వరకు ఫైన్ పడుతోంది. అయితే ఈ కొత్త రూల్స్ తోనే ఆగమాగం అవుతున్నా వాహన వినియోగదారులకు ఏపీ సర్కారు తాజాగా షాకిచ్చింది.

ఏపీ రవాణా శాఖ తాజాగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కొరఢా జులిపించింది. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అందరికీ చేరువైన ఆయుధాన్ని తయారు చేసి ఇచ్చింది. ఏపీ రవాణా శాఖ ప్రత్యేక వాట్సాప్ నంబర్ 9542800800ను కేటాయించింది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తాయని పేర్కొంది.

ఏపీ వ్యాప్తంగా ఎవరైనా రాష్ డ్రైవింగ్ చేసినా.. రాంగ్ రూట్ లో వెళ్లినా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నట్టు కనిపించి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే మీరే ఒక పోలీస్ కావచ్చు. ఉల్లంఘనదారుల ఫొటోలను తీసి రవాణాశాఖ వాట్సాప్ నంబర్ కు పంపవచ్చు. దీంతో వారిపై జరిమానా పడుతుంది. వారి ఇంటికే జరిమానా పంపుతారు. చలాన్లు కట్టకపోతే లైసెన్స్ రద్దు చేస్తారు.

పోలీసులు ప్రధాన కూడళ్లలో తప్పితే పట్టణాలు - నగరాల్లోని గల్లీలు - రహదారులపై ఉండరు.. అందుకే ప్రజలనే పోలీసులుగా మార్చుతూ ట్రాఫిక్ ఉల్లంఘనదారులకు శిక్షవేసేలా ఏపీ రవాణా శాఖ సరికొత్త ప్లాన్ చేసింది. వాట్సాప్ నంబర్ ను కేటాయించింది. దీంతో వాహనదారులు బీ అలెర్ట్ గా ఉండండి..