Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : ఏపీ టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్..ఏంటంటే?
By: Tupaki Desk | 14 April 2020 8:30 AM GMTఏపీలో టెన్త్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ గడువు మే 3 వరకు పొడగించడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కారణంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించలేకపోతున్నామని ప్రకటించిన విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ ...ఏపీ వ్యాప్తంగా ఉన్న పదో తరగతి విద్యార్థులకు దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా పాఠాలు చెప్పబోతున్నట్టు ప్రకటించారు. పరీక్షలు జరిపేంత వరకు ఈ ఆన్ లైన్ తరగతులు కొనసాగుతాయని మంత్రి వెల్లడించారు.
ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు.. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పబ్లిక్ పరీక్షలకు సంబంధించి క్లాసులు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అవే క్లాసులను యూట్యూబ్ సప్తగిరి ఛానల్ లో కూడా అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. విద్యామృతం పేరుతో ఈ కార్యక్రమం రూపొందించామని - అన్ని శాఖల పరిధిలోని స్కూల్స్ నుంచి అధ్యాపకుల ఎంపిక చేశామని తెలిపారు.
ఛానల్ లో వచ్చే ఈ క్లాసులకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాదు విద్యార్థుల హాజరుకు సంబంధించి గ్రామ సచివాలయ సిబ్బంది విద్యా శాఖకు సమాచారం అందిస్తారు. ఉపాధ్యాయులు కూడా హాజరును పరిశీలించనున్నారు. స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులకు ఇలా పాఠాలను బోధించడానికి ఏర్పాట్లు చేశారు. కరోనా - లాక్ డౌన్ దెబ్బకు స్కూళ్లన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని ప్రైవేట్ స్కూళ్లు కూడా ఆన్ లైన్ పాఠాలు చెబుతున్నాయి. దీనితో ఏపీ ప్రభుత్వం కూడా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఆన్ లైన్ లో క్లాసులు చెప్పడానికి ఉత్సాహం ఉన్న ఉపాధ్యాయలు కూడా ముందుకు రావచ్చు అని మంత్రి మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.