Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇది నిజంగా చ‌రిత్రే!

By:  Tupaki Desk   |   7 Jun 2020 4:09 PM GMT
జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇది నిజంగా చ‌రిత్రే!
X
ఏపీ ముఖ్య‌మంత్రి - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి మ‌రోమారు త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. మాట‌త‌ప్ప‌ను మ‌డ‌మ తిప్ప‌ను అనే మాట చెప్పే వైఎస్ జ‌గ‌న్ తాజాగా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన మ‌రో హామీ నిలుపుకున్నారు. గ‌త‌ ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీల మేరకు జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. సముద్రంలో చేపల వేటకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించారు. రాష్ట్రంలో మత్స్యకారుల వలసలను నివారించడంతో పాటు వారి జీవన ప్రమాణాలను పెంచే దిశగా కొత్తగా 11 చోట్ల ఫిషింగ్ హార్బర్లు - ఒక ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణ‌యం అతి పెద్ద తీరం కలిగిన రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మత్యపరిశ్రమపై ఆధార‌ప‌డిన వారి జీవితాల‌ను మా‌ర్చుతుంద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

గ‌తంలో ఏపీలో ఎనిమిది చోట్ల ఫిషింగ్ హార్బర్లకు సంబంధించి సీఎం జగన్ గతంలో స్వయంగా వెల్లడించారు. దీనికి తోడుగా హార్బర్ల సంఖ్యతోపాటు వ్యయాన్ని కూడా పెంచిన విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు. మొత్తం రూ.3500 కోట్లతో నిర్మాణాలు - వసతులు ఏర్పాట్లు చేపట్టనున్నారు. ఈ విధానాల ప్ర‌కారం - తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ(మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్) పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం(మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్) - శ్రీకాకుళం జిల్లా బడగట్లపాలెం(మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్) - శ్రీకాకుళం జిల్లాలోని మంచినీళ్లపేటలో ఫిష్‌ ల్యాండ్‌ నిర్మాణం - విశాఖపట్నం జిల్లా పూడిమడక(మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్) - కృష్ణాజిల్లా మచిలీపట్నం(మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్) - గుంటూరుజిల్లా నిజాంపట్నం(మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్) - ప్రకాశం జిల్లా కొత్తపట్నం(మేజర్‌ షిఫింగ్‌ హార్బర్‌) - నెల్లూరు జిల్లా జువ్వలదిన్న(మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్‌) ఏర్పాటు కానుంది.

ఏపీ సీఎం నిర్ణ‌యాల గురించి విజ‌య‌సాయిరెడ్డి వెల్ల‌డిస్తూ - తాజా నిర్ణయంతో మత్యకారులు ఎక్కువగా నివసించే 11 ప్రాంతాల్లో భారీ మార్పులు రాబోతున్నాయని విజ‌య‌సాయిరెడ్డి చెప్పారు. గత సీఎం చంద్రబాబు.. మత్స్యకారుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంభించారని ఏపీ నుంచి 25వేల మందికిపైగా మత్స్యకారులు జీవనోపాధి కోసం ప్రతి ఏటా వందల మైళ్ళ దూరంలో ఉన్న గుజరాత్ తీరానికి వలసవలస పోయే పరిస్థితి నెలకొందని - అటు నుంచి పొరపాటున పాకిస్తాన్ జలాల్లో ప్రవేశిస్తే వారు జైలు పాలైన రోజులు ఉన్నాయ‌‌న్నారు. సముద్రంలో చేపల వేటకు అవసరమైన కనీస మౌలిక వసతుల కల్పన కూడా చంద్ర‌బాబు పట్టించుకోలేదని కానీ జ‌గ‌న్ స‌ర్కారు మాత్రం విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకుంద‌ని తెలిపారు.