Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి.. అంద‌రి రాజ‌ధాని.. కేవ‌లం రైతుల‌కే కాదు.. హైకోర్టు వ్యాఖ్య‌లు..

By:  Tupaki Desk   |   16 Nov 2021 11:30 AM GMT
అమ‌రావ‌తి.. అంద‌రి రాజ‌ధాని.. కేవ‌లం రైతుల‌కే కాదు.. హైకోర్టు వ్యాఖ్య‌లు..
X
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి కేవ‌లం రైతుల‌కు మాత్ర‌మే రాజ‌ధానికాద‌ని.. రాష్ట్రంలోని ప్ర‌తి ఒక్కరికీ రాజ‌ధాని అని రాష్ట్ర హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. రాజ‌ధాని అంశంపై రోజు వారీ విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు.. సోమ‌వారం నుంచి రోజూ.. దీనిపై వాద‌న‌లు వింటున్న విష‌యం తెలిసిందే. తాజాగా రాజధాని అమరావతి కేసులపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. పిటిషనర్ల తరఫున న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. అమరావతికి సంబంధించిన కీలకాంశాలు కోర్టు దృష్టికి తెచ్చారు. రాజధాని కోసం రైతులు జీవనోపాధిని త్యాగం చేశారని పేర్కొన్నారు.

రాజకీయ కారణాలతో అమరావతి దెయ్యాల రాజధానిగా మారిందని అన్నారు. అమరావతిని త్వరగా అభివృద్ధి చేసి రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా జోక్యం చేసుకున్న హైకోర్టు ప్ర‌ధాన‌ న్యాయ‌మూర్తి.. జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా.. ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమ‌రావ‌తి కోసం.. రైతులు.. 33 వేల ఎక‌రాల భూమిని.. స్వ‌చ్ఛందంగా ఇచ్చార‌ని.. త‌న‌కు తెలిసి.. ఈ దేశంలో ఇంత భూమిని .. రైతులు స్వ‌చ్ఛందంగా ఇచ్చిన ప‌రిస్థితి లేద‌ని అన్నారు. భార‌త స్వాతంత్య్రోద్య‌మ కాలంలోనే ఇలాంటి వి జ‌రిగిన‌ట్టు.. చ‌దువుకున్నామ‌న్నారు.

అదేస‌మ‌యంలో రాజ‌ధాని రైతులు చేస్తున్న పోరాటాన్ని హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి స్వాతంత్య్ర సంగ్రామంతో పోల్చారు. నాడు.. దేశ స్వాతంత్య్రం కోసం.. ఎంద‌రో రోడ్ల మీద‌కు వ‌చ్చి.. పోరాడార‌ని.. వారంతా.. త‌మ కోసం పోరాటం చేయ‌లేద‌ని.. ఈ దేశం కోసం .. పోరాడార‌ని.. సీజే వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఇప్పుడు... అమ‌రావ‌తి కోసం. పోరాటం చేస్తున్న రైతులు కూడా త‌మ కోసం పోరాడ‌డం లేద‌ని.. త‌మ స్వార్థం కోసం.. రోడ్డెక్కిన‌ట్టు క‌నిపించ‌డం లేద‌ని.. రాష్ట్రం కోసం.. రాష్ట్ర ప్ర‌జ‌ల కోస‌మే రైతులు.. ఉద్య‌మిస్తున్న‌ట్టుగా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని.. సీజే ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా వ్యాఖ్యానించారు.

అమ‌రావ‌తి అంటే. కేవ‌లం వారిదే కాద‌ని. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ది అంద‌రిదీ అని... సీజే ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం ఈ వాద‌న‌లు కొన‌సాగ‌నున్నాయి. రాష్ట్ర రాజ‌ధానిని తొక్కిప‌ట్టేందుకు.. ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని.. దీనిని అభివృద్ధి చేసేలా ఆదేశించాల‌ని కోరుతూ.. రైతుల సంఘాల జేఏసీ. అమ‌రావ‌తి జేఏసీ నేత‌లు.. హైకోర్ట‌లో వ్యాజ్యాలు వేశారు. వీటిపై తాజాగా రోజువారీ విచార‌ణ జరుగుతోంది. అనంత‌రం హైకోర్టు తీర్పు ఇవ్వ‌నుంది.