Begin typing your search above and press return to search.

పాడు విషయంలో ఏపీకి రెండో ర్యాంక్

By:  Tupaki Desk   |   1 Nov 2019 3:03 AM GMT
పాడు విషయంలో ఏపీకి రెండో ర్యాంక్
X
కొన్ని విషయాల్లో టాప్ లో ఉండటం ఆయా రాష్ట్రాలకు.. రాష్ట్ర ప్రజలకు సంతోషాన్ని ఇవ్వటమే కాదు.. గర్వంగా అనిపిస్తుంటుంది. అదే సమయంలో మరికొన్ని విషయాల్లో తాముండే రాష్ట్ర ప్రస్తావన రావటాన్ని సైతం ఇష్టపడరు. బ్యాడ్ లక్ ఏమంటే.. ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు అలాంటి దరిద్రపుగొట్టు విషయంలో దేశంలోనే సెకండ్ ప్లేస్ నిలిచి.. వామ్మో.. ఏపీ అంత డేంజరా? అనిపించే గణాంకాలు విడుదలయ్యాయి.

తాజాగా దేశంలో అత్యధికంగా హెచ్ఐవీ పాజిటివ్.. ఎయిడ్స్ రోగుల్లో రాష్ట్రాల వారీగా ర్యాంకులు ప్రకటించారు. ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ టాప్ టూ ర్యాంకులో నిలిచింది. అదే సమయంలో సోదర తెలంగాణ రాష్ట్రం మాత్రం ఈ విషయంలో ఐదో స్థానంలో నిలిచింది.

2018 డిసెంబరు నాటికి దేశ వ్యాప్తంగా 12.73 లక్షల మంది హెచ్ఐవీ.. ఎయిడ్స్ లాంటి వాటిలో బాధ పడుతుంటే.. అందులో 1.82 లక్షల మంది కేవలం ఏపీకి చెందిన వారు కావటం గమనార్హం. తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఈ మహమ్మారితో బాధపడుతున్న వారు 78 వేల మందిగా తేల్చారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ హెల్త్ ప్రొఫైల్ నివేదిక ఈ ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించింది.