Begin typing your search above and press return to search.
ఆ బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లాయంటూ క్లారిటీ ఇచ్చారు
By: Tupaki Desk | 25 Jan 2020 4:17 AM GMTఅందుకే అంటారు కాలం చాలా చిత్రమైందని. కొందరు తమ జీవితం లో సాధించ లేని పేరు ప్రఖ్యాతులు.. ఒక్క రోజు లో సొంతం చేసుకుంటారు. అందుకు నిదర్శనం గా ఏపీ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ ఈ కోవకే వస్తారు. నిజానికి విభజన తర్వాత ఏపీ శాసన మండలి కి షరీఫ్ అనే పెద్ద మనిషి చేతికి ఇచ్చిన విషయం ఆ రాష్ట్రానికి చెందిన వారే తప్పించి.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఆయనెలా పని చేస్తారన్న దానిపై క్లారిటీ లేదు.
కానీ.. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో సీఆర్డీయే రద్దు.. ఏపీ రాజధానుల వికేంద్రీకరణ బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపుతూ సంచలన నిర్ణయం తీసుకోవటం ద్వారా మండలి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న షరీఫ్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. తన జీవితకాలంలో సంపాదించిన పేరు ప్రఖ్యాతులకు మించి ఆయన సొంతం చేసుకున్నారు. అధికార పార్టీ ఆగ్రహాన్ని కాస్త పక్కన పెడితే.. ఇవాల్టికున్న పరిస్థితుల్లో అలాంటి నిర్ణయాన్ని తీసుకోవటం మామూలు విషయం కాదు.
ఎవరికి వారు.. పవర్ కు లొంగిపోతున్న వేళ.. అందుకు భిన్నంగా వ్యవహరించిన షరీఫ్.. తాజాగా ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. సెలెక్ట్ కమిటీకి ఏపీ రాజధానుల వికేంద్రీకరణ బిల్లు.. సీఆర్డీయే రద్దు చట్టానికి సంబంధించిన బిల్లును వెళ్లిపోయాయన్నారు.
ఇంకా సెలెక్ట్ కమిటీ కి వెళ్లలేదంటూ సాగుతున్న ప్రచారంలో నిజం లేదని.. బిల్లులు సెలెక్ట్ కమిటీ కి వెళ్లాయని స్పష్టం చేశారు. కాకుంటే.. సెలెక్ట్ కమిటీ లో సభ్యుల ఎంపిక మాత్రం ఇంకా పూర్తి కాలేదన్నారు. సో.. సెలెక్ట్ కమిటీ మీద భిన్నమైన వాదన వినిపించే వారు షరీఫ్ వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు.