Begin typing your search above and press return to search.

మరో వివాదం : నిలువెత్తు టీడీపీ భవనం వెనక...?

By:  Tupaki Desk   |   15 July 2022 4:03 PM GMT
మరో వివాదం : నిలువెత్తు టీడీపీ భవనం వెనక...?
X
తెలుగుదేశం పార్టీది ఘనకీర్తి. దశాబ్దాల చరిత్ర. ఎన్నో సార్లు అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం కూడా ఏపీలో రాజకీయంగా కీలక స్థానంలో ఉంది. చాన్స్ వస్తే మరోమారు అధికార పీఠం ఎక్కడానికి సిద్ధంగా ఉంది. అలాంటి టీడీపీ మంగళగిరిలో కట్టిన బహుళంతస్థుల భవనం ఇపుడు వివాదంగా మారిందా అంటే అవును అనే వస్తొంది.

ఈ భవనం కట్టిన ఒక సంస్థ కోర్టుకు వెళ్లి మరీ తన బకాయిలు చెల్లించేలా చూడాలని మధ్యవర్తిని పెట్టి సమస్య పరిష్కరించాలని కోరింది. దానికి అనుగుణంగా తెలంగా హై కోర్టు తాజాగా మధ్యవర్తిని నియమించడంతో నిలువెత్తు తెలుగు దేశం భవనం నిర్మాణం వెనక ఏముంది ఏం జరిగింది అన్న ఆసక్తి అందరిలో కలుగుతోంది.

వివారాలు చూస్తే తమాషాగానే ఉన్నాయి. మంగళగిరిలో టీడీపీ ఆఫీస్ కట్టింది హైదరాబాద్‌కు చెందిన ప్రెకా సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. ఈ నిర్మాణానికి అయ్యే ఖర్చుని చెల్లిస్తామని హామీ ఇచ్చి ఒప్పందం కుదుర్చుకుంది విశాఖకు చెందిన ఎస్‌ఎస్‌ఆర్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ అనే సంస్థ. ఇక టీడీపీ కార్యాలయ భవనాన్ని ప్రీకాస్ట్‌ పద్ధతిలో నిర్మించేందుకు ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం 2018లో కుదిరింది.

మొత్తానికి ఈ భవనాన్ని అద్భుతంగా ఒప్పందంలో భాగంగా ప్రెకా సొల్యూషన్స్‌ 1.01 కోట్ల రూపాయలకు విలువైన పనులను పూర్తి చేసింది. ఆ తరువాత ఒప్పందం ప్రకారం తనకు రావాల్సిన డబ్బుల కోసం ఎస్‌ఎస్‌ఆర్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ ని పలు మార్లు ప్రెకా సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంప్రదిస్తూ వచ్చింది. ఇందులో 2019 డిసెంబర్‌లో 8.21 కోట్ల రూపాయల ప్రీ ఫైనల్ బిల్లుల కోసం ప్రెకా సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కోరుతూ బిల్లులు కూడా ప్రొడ్యూస్ చేసింది.

అక్కడ నుంచి కధ చాలా మారింది. ఎస్‌ఎస్‌ఆర్‌ ప్రాజెక్ట్స్‌ తమకేంటి బిల్లుల చెల్లింపులతో సంబంధం అంటూ విచిత్ర వాదన లేవదీసి టీడీపీతోనే తేల్చుకోవాలని కోరడం జరిగింది. దాని మీద రెండు సంస్థల మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు ఎన్నో జరిగాయి. కానీ లావాదేవీలు సెట్ కాలేదు. మొత్తానికి విషయం బాగా అర్ధమయ్యాక ప్రెకా సొల్యూషన్స్‌ తెలంగాణా హై కోర్టుని ఆశ్రయించింది.

దాంతో కోర్టు ఇపుడు కోర్టు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పాములపర్తి స్వరూప్‌రెడ్డిని నియమించింది. మధ్యవర్తి ఫీజును చట్ట ప్రకారం ఇరుపక్షాలు సమానంగా భరించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బొల్లంపల్లి విజయసేన్‌రెడ్డి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ వ్యవహారం సెటిల్ అవుతుందో లేదో పక్కన పెడితే టీడీపీ భవనం మంగళగిరిలో ఆకాశాన్ని అంటేలా ఉంది. ఇంతటి వైభవంతో వర్ధిల్లే ఈ భవననం నిర్మాణం వెనక బకాయిలు ఉండడం వాటి మీద కోర్టు దాకా కధ సాగడం మాత్రం ఇబ్బందిని కలిగించేదే అంటున్నారు.

దీని కంటే ముందు ఈ భవనాన్ని వాగు పోరంబోకు స్థలంలో నిర్మించడంపై న్యాయస్థానంలో వివాదం కొనసాగుతుండడం విశేషం. మొత్తానికి రాజకీయం పార్టీ దశాబ్దులుగా కొనసాగుతున్న పార్టీ విషయంలో ఇలా వివాదాలు చెలరేగడం మాత్రం ఆలోచించాల్సిన విషయమే. టీడీపీకి ఆయువుపట్టు లాంటి భవనం, ప్రధాన కార్యాలయం ఇలా వివాదాలతో ఉండడం ప్రత్యర్ధుల విమర్శలకు తావిచ్చేలా ఉంది అంటున్నారు.