Begin typing your search above and press return to search.

రాజ్ నాథ్ సింగ్ ముందు ఏపీ ఎంపీల ఫైటింగ్

By:  Tupaki Desk   |   31 Jan 2020 4:42 AM GMT
రాజ్ నాథ్ సింగ్ ముందు ఏపీ ఎంపీల ఫైటింగ్
X
పార్లమెంట్ సమావేశాల నేపథ్యం లో ఢిల్లీలో నిర్వహించిన అఖిల పక్షం సమావేశం ఏపీలో ఎంపీల ఫైటింగ్ కు వేదికగా మారింది. ఈ మీటింగ్ లో ఇద్దరు ఏపీ ఎంపీలు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముందే ఢీ అంటే ఢీ అనే వరకు పరిస్థితి వెళ్లింది.

ఏపీ ఎంపీల వాగ్వాదం చూసి మధ్యలో దేశంలోని ఇతర పార్టీల ఎంపీలు కలుగజేసుకొని సర్దిచెప్పినా తెలుగు ఎంపీలు వినే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఏకంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కలుగజేసుకొని మాట్లాడినట్టు సమాచారం.

ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మూడు రాజధానులు, మండలి రద్దు అంశాన్ని వైసీపీ సభ్యులు లేవనెత్తగా.. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తనను వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసి దారుణంగా ట్రీట్ చేసిందని ప్రస్తావించారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభ్యంతరం తెలిపారు. రాష్ట్ర పరిధి లోని అంశం ఎందుకు ప్రస్తావిస్తున్నారని నిలదీశారు.

అఖిల పక్ష సమావేశంలో మిగతా ఎంపీలు ఆపినా ఆగని తెలుగు ఎంపీల ఫైటింగ్ చూసి సీరియస్ అయిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ దీని పై సీరియస్ గా స్పందించారు. ‘ఏపీలో ఏమీ అవుతుందో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మా దగ్గర ఉందని.. మీరు గొడవ చేయ వద్దంటూ’ హెచ్చరికలు చేస్తే గానీ తెలుగు ఎంపీల గొడవ సద్దుమణగలేదంట..