Begin typing your search above and press return to search.
ఆంధ్రప్రదేశ్ కు కొత్త లోగో
By: Tupaki Desk | 5 Nov 2015 6:42 AM GMTరాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన పూర్తి చేసుకున్న నవ్యాంధ్ర ప్రత్యేకంగా రాష్ట్ర లోగోను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ - ఉదయిస్తున్న రాష్ట్రం(సన్ రైజ్ స్టేట్) పేరుతో ఈ నూతన లోగోను రూపొందించారు. ఈ లోగో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త రాష్ట్రంలో లోగోలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందుకోసం పోటీలు కూడా పెట్టి మంచి లోగోలు తయారుచేయించి బహుమతులు ఇస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఇది చూశాం. గోదావరి పుష్కరాల సమయంలో గోదావరి గొప్పదనం - ఆ ప్రాంత వైభవం - సంస్కృతి - సంప్రదాయాలు వంటివన్నీ ప్రతిబింబించేలా లోగో చేయాలని చంద్రబాబు సూచించారు. ఆయన ఆదేశాలతో సాంస్కృతిక శాఖ పోటీలు పెట్టి లోగోలను ఆహ్వానించింది. అందులో ఉత్తమమైన లోగోను ఎంపిక చేసి ప్రభుత్వం పరంగా గోదావరి పుష్కరాల కార్యక్రమాలు, ప్రచారంలో విరివిగా వాడారు. ఆ లోగోకు మంచి గుర్తింపు వచ్చింది కూడా. అనంతరం మొన్న రాజధాని అమరావతి శంకు స్థాపన సందర్భంలోనూ లోగోలను ఆహ్వానించారు. ఆ కార్యక్రమం కోసమూ ప్రత్యేకంగా లోగోను తయారు చేయించారు.
ఇప్పటికే సందర్భాన్ని బట్టి లోగోలు చేయించిన ప్రభుత్వం ఈసారి ఏకంగా రాష్ట్రం కోసం ప్రత్యేకంగా లోగో చేయిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని ఇంకా ఖరారు చేయకపోయినా నాలుగైదు డిజైన్లు మాత్రం ప్రభుత్వ పరిశీలనతో ఉన్నాయని చెబుతున్నారు. వాటిలో ఒకటి ఇప్పుడ సోషల్ మీడియాలో తిరుగుతోంది.