Begin typing your search above and press return to search.

హ‌మారా స‌ఫ‌ర్ : ఏపీలో పొత్తుల ఈక్వేష‌న్లు ఇవే !

By:  Tupaki Desk   |   19 May 2022 1:07 AM GMT
హ‌మారా స‌ఫ‌ర్ : ఏపీలో పొత్తుల ఈక్వేష‌న్లు ఇవే !
X
జ‌న‌సేన, బీజేపీ క‌లిసి పోటీ చేస్తుంది. టీడీపీ ఒంటరిగా వెళ్తుంది. వీలుంటే ఓ కొత్త పార్టీ కూడా వ‌స్తుంది తెర‌పైకి..కానీ ఆ పార్టీ కూడా సింగిల్ గానే ఫైట్ చేస్తుంది. ఆ పార్టీ సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ నేతృత్వంలో రానుంది. అదేవిధంగా ఓడినా గెలిచినా వైసీపీ సింగిల్ గానే ఫైట్ చేస్తుంది. ఆ విధంగా నానీలు, అంబటిలు, రోజాలు చెప్పిన విధంగా సింహం సింగిల్ గానే వ‌స్తుంది. బీజేపీతో పొత్తులు ఖ‌రారు కాకపోతే కొన్నింట మాత్రం ఆప్ - జ‌న‌సేన కూడా క‌లిపి ప్ర‌యాణం చేసే అవ‌కాశాలు ఉన్నాయి.

క‌మ్యూనిస్టుల గురించే ఇప్ప‌టిదాకా ఇంకా ఏ స్ప‌ష్టం అయిన వివ‌రం కూడా రావ‌డం లేదు. కాస్తో కూస్తో ఆప్ పార్టీకి క‌మ్యూనిస్టుల‌కూ మంచి బంధాలు ఉన్నాయి క‌నుక వాళ్లూ వీళ్లూ క‌లిసి అల‌యెన్స్ ను ఫాం చేసే అవ‌కాశాలూ కొట్టిపారేయ‌లేం. అంటే బీజేపీ కాకుండా ప‌వ‌న్ వ‌ర్గాలు ఆప్ తో క‌లిసి, క‌మ్యూనిస్టుల‌తో క‌లిసి ఎన్నిక‌ల యుద్ధానికి దిగ‌వ‌చ్చు. ఆ విధంగా జ‌గన్ పై పైచేయి సాధించ‌వ‌చ్చు. ఇదంతా ఓ హైపోథిటిక‌ల్ వెర్ష‌న్.. ఈ విధంగా కావొచ్చు. కాక‌పోవ‌చ్చు.. ఏమో ! గుర్రం ఎగ‌రావచ్చు!

ఇక ఏపీలో కీలక ప్రతిపక్ష పార్టీ టీడీపీ... బాదుడే బాదుడు పేరిట నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాల‌కు విశేష స్పంద‌న వ‌స్తుంది. దీంతో తెలుగు దేశం దండు ఇంతః పూర్వం క‌న్నా బాగా ప‌నిచేస్తోంది. ముఖ్యంగా దావోస్ లో జ‌ర‌గ‌నున్న వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరంలో జ‌గ‌న్ ఏం మాట్లాడినా, మాట్లాడ‌కున్నా ఆ రోజు చంద్ర‌బాబు హ‌యాంలో రాబ‌ట్టిన విదేశీ పెట్టుబ‌డుల గురించే టీడీపీ అత్య‌ధికంగా ఫోక‌స్ చేస్తోంది.

తాము పెట్టుబ‌డుల‌ను తీసుకువ‌స్తే వాటిని ర‌ద్దు చేసి, మ‌ళ్లీ అవే కంపెనీల‌తో దోస్తీ చేయ‌డం అన్న‌ది వైసీపీకే చెల్లు అని అంటోంది. ప‌వ‌ర్ పాల‌సీ కూడా తాము అనుస‌రించిందే ఉత్త‌మం అని చెబుతున్నా వినిపించుకోలేదు అని, కేంద్రం చెప్పినా కూడా విన‌ని కార‌ణంగానే రాష్ట్రంలో అసాధార‌ణ రీతిలో విద్యుత్ కోత‌లు అమ‌లవుతున్నాయ‌ని, అదే స‌మ‌యంలో కొన్ని ఒప్పందాల ర‌ద్దు కార‌ణంగానే నాణ్య‌మైన విద్యుత్ నిరంత‌రాయంగా వ్య‌వ‌సాయ రంగానికీ, ప‌రిశ్ర‌మ‌ల‌కూ అంద‌కుండా పోతోంద‌ని ఉదాహర‌ణ‌ల‌తో స‌హా వివ‌రిస్తోంది. ఇవ‌న్నీ టీడీపీకి ప్ల‌స్ పాయింట్లు. ఇదే సమ‌యాన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న వైసీపీకి మాత్రం చేదు అనుభ‌వాలే ఎదురు వ‌స్తున్నాయి. వీట‌న్నింటినీ ప‌రిగ‌ణిస్తే జ‌న‌సేన కూడా చేప‌డుతున్న విభిన్న కార్య‌క్ర‌మాలు బ‌లీయంగా పోతున్నాయి.

ముఖ్యంగా విప‌క్ష పార్టీల‌ను ఉద్దేశించి విచ‌క్ష‌ణా ర‌హితంగా తిడుతున్న వైనంతో వైసీపీ బ‌ల‌హీన ప‌డుతోంది అన్న‌ది ఓ వాద‌న. దీని పై చ‌ర్చ సోష‌ల్ మీడియాలో విపరీతంగా న‌డుస్తోంది. సో.. విప‌క్షం బ‌ల‌ప‌డితే అధికార ప‌క్షం ఏం కావాలి. ఉన్నంత‌లో ముంద‌స్తు ఎన్నిక‌లకు పోవాలి. అదే గ‌నుక జ‌రిగితే బీజేపీ, జ‌న‌సేన క‌లిస్తే ఓ విధంగా ల‌బ్ధి ద‌క్కేది కూడా బీజేపీకే ! కానీ టీడీపీ తో మాత్రం దోస్తీకి నై చెబుతోంది బీజేపీ.

ఎలా అయినా విప‌క్షం పొత్తులు క‌న్ఫం అయినా కాకున్నా ముంద‌స్తు ఎన్నిక‌ల షెడ్యూల్ ఏ నిమిషాన అయినా రానున్న కాలంలో వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని జ‌గ‌న్ మ‌నిషి స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి తేల్చేయ‌డంతో విప‌క్ష పార్టీలు వేరే ఆలోచ‌న‌కు తావివ్వ‌క స్ప‌ష్టం అయిన విధానాల ప్ర‌క‌ట‌న ఇప్ప‌టికైనా చేస్తే మేలు.అదేవిధంగా ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల తీరు ఎలా ఉన్నా అధికారంలోకి వ‌స్తే ప్ర‌జ‌ల‌కు ఏం చేస్తామో అన్న‌ది విధివిధానాలు ప్ర‌క‌టిస్తే ఇంకా మేలు. ఏ ప్ర‌భుత్వం అయినా ఇప్ప‌టిలా కాకుండా సంప‌ద వృద్ధి కేంద్రాల నిర్మాణంపై ఫోక‌స్ చేస్తే ఇంకా మేలు.