Begin typing your search above and press return to search.
రాసి పెట్టుకోండి.. ఏపీలో రాబోయేదంతా కూల్చుడు కాలమే
By: Tupaki Desk | 20 Jun 2022 6:35 AM GMTమంచి త్వరగా రాదు.. చెడు మాత్రం చాలా వేగంగా వ్యాపిస్తుందని ఊరికే అనరు. అంతదాకా ఎందుకు? పాజిటివ్ గా ఆలోచించే కన్నా.. నెగిటివ్ గా ఆలోచించేందుకే ఎక్కువ ఆసక్తి చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. వ్యక్తుల విషయాన్ని పక్కన పెడితే.. వ్యవస్థలో మంచి కంటే చెడే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలా అని మంచి లేదని చెప్పటం లేదు. కానీ.. చెడు చూపించే దుష్పరిణామాలు చాలామంది మీద ప్రభావాన్ని చూపిస్తుంటాయి. దక్షిణాది రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలు కాస్త భిన్నంగా ఉంటాయి.
వ్యక్తి పూజ ఎక్కువ.. రాజకీయ ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూడటమే కాదు.. ఎవరికి వారు తమకు అవకాశం వచ్చిన ప్రతిసారీ ప్రతీకారాన్ని చూపించేందుకు అస్సలు మొహమాటపడరు. తమిళనాడుకు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో అందుకు భిన్నమైన రాజకీయం నడిచేది. కొన్ని జిల్లాల్ని పక్కన పెడితే.. మొత్తంగా చూసినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయాలు మరీ వ్యక్తిగత స్థాయికి చేరలేదనే చెప్పాలి.
విభజనకు కాస్త ముందు నుంచి మొదలైన రాజకీయ రచ్చ అంతకంతకూ పెరిగిపోవటమే కాదు.. ఇప్పుడు అన్ని స్థాయిల్ని దాటిపోయిన పరిస్థితి. గతంలో రాజకీయ వైరం ఉన్నప్పటికీ.. అది వ్యక్తిగత స్థాయికి చేరలేదు. పార్టీలు వేరు అయినప్పటికి.. వ్యక్తిగత స్నేహాలు అందుకు భిన్నంగా ఉండేవి. వీటిని గురించి గొప్పగా చెప్పుకునే పరిస్థితి. విభజన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు.. రాజకీయ రంగంలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన కొందరు అధినేతల తీరు ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయేలా చేశాయి.
అన్నింటికి మించి ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. రాజకీయ రంగు.. రుచి.. వాసన పూర్తిగా మారిపోయింది. తనను వ్యతిరేకించే వారిని సైతం అభిమానించేలా చేస్తానని.. అది కూడా ఆర్నెల్ల వ్యవధిలోనే చేస్తానంటూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటానికి ముందే చెప్పినప్పుడు.. యువకుడైన ఆయన కొత్త తరహా రాజకీయాన్ని పరిచయం చేస్తారేమో అన్న భావన వ్యక్తమైంది. అందుకు భిన్నంగా తనను.. తన పార్టీని వ్యతిరేకించే వారే కాదు.. ఘాటుగా విమర్శలు చేసే వారిపై ఏదో ఒక కేసు నమోదు కావటం.. అరెస్టు కావటం. .జైలుకు వెళ్లటం లాంటివి జరిగాయి.
ఇక్కడితో ఆగినా సరిపోయేది. ఇప్పుడు అందుకు భిన్నంగా తనను.. తన పార్టీని టార్గెట్ చేసిన వారి ఆర్థిక మూలాలు.. ఆస్తుల ధ్వంసానికి సైతం వెనుకాడలేదన్న అపప్రద మూటకట్టుకున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నేతల ఆస్తులు అక్రమంగా తేల్చి గోడలు.. గదుల్ని కూల్చివేసిన వైనాలు ఇప్పటికే పలువురు నేతలకు వ్యక్తిగతంగా అనుభవంలోకి వచ్చాయి. తాజాగా టీడీపీ ఫైర్ బ్రాండ్.. అయ్యన్నపాత్రుడి ఉదంతం గురించి తెలిసిన ఆయన క్యాడర్ మొత్తం రగిలిపోతున్నారు. నిజంగానే భారీగా ప్రభుత్వ స్థలాన్ని కట్టేసి ఉంటే తొలగింపుల్లో భాగంగా ఆస్తుల్ని ధ్వంసం చేయటం సబబే.
అందుకు భిన్నంగా కేవలం 2 సెంట్ల (గజాల్లో చూస్తే 100 కంటే తక్కువ) ప్రభుత్వ భూమిలోకి ఫైర్ బ్రాండ్ అయ్యన్నపాత్రుడి గోడను.. ఇంటిగదిని కూల్చేయటం.. మిగిలిన స్థలం మీద విరుచుకుపడటం లాంటవి చోటు చేసుకున్నాయి. ఇదంతా చూసినప్పుడు.. అధికారం ఎవరి చేతిలో ఉంటే వారు.. తమ రాజకీయ ప్రత్యర్థుల ఆస్తుల మీద ఇదే తరహాలో చట్టాన్ని ప్రయోగించటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. గడిచిన మూడేళ్లలో చట్టాన్ని ఎంత పదునుగా.. కఠినంగా అమలు చేయొచ్చన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని పార్టీలకు అర్థమయ్యేలా చేసింది.
అంతేకాదు..గతంలోని మొహమాటాల్ని పక్కన పెట్టేసింది. ఒకవేళ చంద్రబాబు లాంటి పాతకాలపు పార్టీ అధినేత మరోసారి ముఖ్యమంత్రి అయితే.. ఇలాంటి కూల్చివేతలకు ఆయన నో చెప్పినా.. ఆయన పార్టీ నేతలు ససేమిరా అని తేల్చి చెప్పటమేకాదు.. చట్టాన్ని కచ్ఛితంగా అమలు చేయాల్సిందేనన్న విషయాన్ని పక్కాగా చెప్పటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఈ లెక్కన చూసినప్పుడు ఏపీలో రాబోయే రోజుల్లో తోపులుగా చెప్పే వైరిపక్షపు నేతల 'అక్రమ కట్టడాలు' ఒకటి తర్వాతఒకటి చొప్పున కూల్చివేతలు వరుస పెట్టి సాగటం ఖాయమంటున్నారు.