Begin typing your search above and press return to search.
ఏపీ విషయంలో కేంద్రం ఇంత అన్యాయంగా ఉందా ?
By: Tupaki Desk | 16 Feb 2022 5:37 AM GMTఏపీ ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి అన్యాయంగానే వ్యవహరిస్తోంది. మిగిలిన అన్ని విషయాలను వదిలేసినా తాజాగా బొగ్గు నిల్వలు, సరఫరా విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తోంది. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ప్రభావం మన రాష్ట్రంలోని జెన్ కో యూనిట్లపై తీవ్రంగా పడుతోంది. విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు సరఫరా అవసరమని రాష్ట్రం ఎంత మొత్తుకుంటున్నా కేంద్రం పట్టించుకోవటం లేదు. బొగ్గు సరఫరా కాకపోతే థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు తప్పవని రాష్ట్రం మొత్తుకుంటోంది.
బొగ్గు నిల్వలు, సరఫరా తదితరాలను రెగ్యులేట్ చేయడానికి కేంద్ర ఇంధన శాఖలోని అత్యున్నత కమిటీ ప్రతి మూడు రోజులకు ఒకసారి రాష్ట్రాలతో మాట్లాడుతుంటుంది. ప్లాంట్లలో ఉన్న బొగ్గు నిల్వల ఆధారంగా బొగ్గు కేటాయింపులను చేస్తుంటుంది. మామూలుగా అయితే ప్రతి ప్రభుత్వం తన దగ్గర 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలను ఉంచుకుంటుంది. ఇలా నిల్వలు ఉంచుకోవటం వల్ల హఠాత్తుగా ఏదన్నా సమస్యలు తలెత్తినా థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
అయితే 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు సాధ్యం కానప్పుడు కనీసం వారం రోజులకు సరిపడా నిల్వలను ఉంచుకుంటుంది. కానీ ఇపుడు ఏపీ దగ్గర కేవలం 3 రోజులకు సరిపడినంత నిల్వలు మాత్రమే ఉన్నాయి. మన రాష్ట్రానికి ప్రతిరోజు సింగరేణి, మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి రావాల్సిన బొగ్గు సరఫరా ఆగిపోయింది. కనీసం మనకు రోజుకు 20 రేక్ ల బొగ్గు సరఫరా అయితేనే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి జరిగితేనే విద్యుత్ సమస్యలు ఉండవు.
ఇపుడు రాష్ట్రం దగ్గరున్న బొగ్గు నిల్వలు మరో మూడు రోజుల విద్యుత్ ఉత్పత్తికన్నా సరిపోవు. ఒక్కరోజు బొగ్గు సరఫరా ఆగిపోతే విద్యుత్ ఉత్పత్తి, సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతుందని అందరికీ తెలిసిందే. ఇపుడు రోజుకు జెన్కో యూనిట్ల నుండి రోజుకు 85 మిలియన్ యూనిట్లు ఉత్పత్తవుతోంది. ఇంతకు మించి ఉత్పత్తి చేయటం సాధ్యం కాదు.
రాబోయే వేసవి కాలం అంటే మార్చి-మే మధ్య రోజుకు 250 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ అవసరమని జెన్కో అంచనా వేస్తొంది. ఈ విషయాలన్నీ కేంద్రానికి రాష్ట్రం వివరిస్తున్నా బొగ్గు సరఫరా చేయటం లేదు. కేంద్రం వైఖరి ఇలాగే ఉంటే రాష్ట్రం పరిస్థితి ఘోరంగా తయారవ్వక తప్పదు.