Begin typing your search above and press return to search.

ఏపీలో కరోనా కల్లోలం.. పెరిగిన డిశ్చార్జీలు!

By:  Tupaki Desk   |   15 Aug 2020 3:16 PM GMT
ఏపీలో కరోనా కల్లోలం.. పెరిగిన డిశ్చార్జీలు!
X
ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది.. ఏమాత్రం తగ్గడం లేదు. ఏపీలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. టెస్టుల సంఖ్య పెంచడంతో కేసులు కూడా పెరుగుతున్నాయి. అయితే కేసులు ఎన్ని పెరుగుతున్న డిశ్చార్జీల సంఖ్య కేసుల కంటే ఎక్కువగా ఉండడం ఊరట కలిగిస్తోంది.

ఏపీలో కరోనా కేసుల కంటే మహమ్మారిని జయించి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. తాజాగా 8వేల వరకు కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో చూస్తే.. తాజాగా కొత్తగా 8732 కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కొత్తగా 24 గంటల్లో 53712 టెస్టులు చేశారు. ఇందులో 8732 పాజిటివ్ గా తేలాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2,81,817కు చేరాయి.

కరోనా నుంచి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,91,117గా ఉంది. గడిచిన ఒక్కరోజులో 10,414మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 88138 యాక్టివ్ కేసులున్నాయి.

తాజాగా కరోనాతో గడిచిన 24 గంటల్లో 87మంది మరణించారు. దీంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 2562కు పెరిగాయి.

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 10మంది, గుంటూరులో 9మంది, తూర్పు గోదావరిలో 8మంది .. పశ్చిమ గోదావరిలో 8మంది మరణించారు.

ఇక ఏపీలోనే అత్యధిక కేసులు తూర్పు గోదావరి జిల్లాలో నమోదయ్యాయి. ఒక్కరోజులో ఏకంగా 1126 కేసులు నమోదయ్యాయి.