Begin typing your search above and press return to search.
గుజరాత్ వన్.. ఏపీ సెకండ్.. తెలంగాణ 13..?
By: Tupaki Desk | 15 Sep 2015 4:49 AM GMTసోమవారం సాయంత్రం టీవీ స్క్రోలింగ్స్ అన్నీ ఒక విషయానికి విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చాయి. బ్రేకింగ్ న్యూస్ అంటూ హడావుడి చేశాయి. సదరు టీవీ బ్రేకింగ్ లు చెప్పిన విషయం ఏమిటంటే.. భారత్ లో పరిశ్రమల స్థాపనకు.. వ్యాపారాలకు అనువుగా ఉండే రాష్ట్రాల ర్యాకింగ్ ఇచ్చాయని.. అందులో గుజరాత్ నెంబర్ వన్ లో ఉంటే.. ఏపీ నెంబర్ టూ స్థానంలో ఉందని.. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ 13వ స్థానంలో ఉందంటూ ఉదరగొట్టేశాయి.
ఇది చూసిన వెంటనే సగటు సీమాంధ్రుడికి సంతోషం. అదే సమయంలో తెలంగాణ వ్యక్తికి ఎన్ని సందేహాలే. ఈ లెక్క ఎప్పుడు వేశారు? ఎలా వేశారు? దేన్ని ప్రాతిపాదికగా తీసుకొని చేశారు? ఏ కాలం నుంచి ఏ కాలం వరకు టైం లిమిట్ పెట్టుకున్నారు లాంటివెన్నో మనసుకు కలిగిన పరిస్థితి.
ఈ అంశం మీద దృష్టి సారిస్తే.. చివరకు తేలిందేమంటే.. ప్రపంచ స్థాయిలో భారత్ లో పరిశ్రమలు పెట్టటానికి అనుకూల వాతావరణం లేదని.. పరిశ్రమలు పెట్టటానికి అనువైన 182 దేశాల్లో భారత్ స్థానం 142 ర్యాంకులో ఉందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. నిర్మాణ అనుమతుల విషయంలో అయితే.. చివరి పది దేశాల్లో ఉన్న దేశం భారత్ మాత్రమే.
‘‘మేకిన్ ఇండియా’’ పేరుతో హడావుడి చేస్తున్న ప్రధాని మోడీకి ఈ ర్యాంకింగ్ ఇబ్బందికరంగా మారింది. వరుస విదేశీ టూర్లు వేస్తూ మేకిన్ ఇండియా అంటున్నా.. అనుమతుల విషయంలో పారదర్శకంగా ఉంటామని ఊరించినా ఫలితం పెద్దగా లేకుండా.. పారిశ్రామిక ఫ్రెండ్లీ దేశం కాదని ప్రపంచ బ్యాంకు నివేదిక చెబుతున్న నేపథ్యంలో.. ఆయన దేశంలోని రాష్ట్రాల్లో పరిశ్రమల స్థాపనకు అనువుగా ఉన్న రాష్ట్రాలు ఏమిటో తెల్చాల్సిందిగా వరల్డ్ బ్యాంక్ చేత ఒక అధ్యయనం చేయించారు.
దీనికి పరిశ్రమల ప్రోత్సాహక విభాగం.. సీఐఐ.. ఫిక్కీ కన్సల్టెన్సీ సంస్థ అయిన కేపీఎంజీతో కలిపి వరల్డ్ బ్యాంకు అధ్యయనం చేసిన నివేదిక తయారు చేసింది. ఈ నివేదికలో గుజరాత్ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిస్తే.. ఆంధ్రప్రదేశ్ నెంబర్ టూ స్థానాన్ని కైశనం చేసుకుంది. ఇక.. మరో తెలంగాణ రాష్ట్రమైన తెలంగాణ జాబితాలో 13వ స్థానంలో నిలిచింది. అయితే.. టాప్ ఫైవ్ జాబితాలో ఉన్న రాష్ట్రాల్లో నాలుగు బీజేపీ నేతృత్వంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కావటం.. మరొకటి బీజేపీ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటం గమనార్హం.
మొన్నామధ్య పెట్టుబడులు ఆకర్షించేందుకు భారీ కార్యక్రమాన్ని చేపట్టి.. ఒక్కరోజులోనే రికార్డు స్థాయి పెట్టుబడులు ఆకర్షించిన తమిళనాడు రాష్ట్రం జాబితాలో 12వ స్థానంలో నిలవగా కేరళ 18వస్థానంలో నిలిచింది. ఇక.. నివేదిక తయారీ కోసం జనవరి 1 నంచి జూన్ 30 మధ్య కాలాన్ని ప్రాతిపదికగా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక.. వ్యాపారాలకు అనువుగా ఉన్న రాష్ట్రాల జాబితాలో అట్టడుగు స్థానంలో మిజోరం.. జమ్మూకశ్మీర్.. మేఘాలయ.. నాగాలాండ్.. అరుణాచల్ ప్రదేశ్ లు నిలిచాయి. మొత్తానికి ప్రపంచ బ్యాంకు నివేదిక అంటూ మోడీ సర్కారు చేయించిన పరిశ్రమలకు ఫ్ల్రెండ్లీ రాష్ట్రాల ర్యాంకింగ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అదృష్టంగా మారాయని చెప్పక తప్పదు.