Begin typing your search above and press return to search.
ఏపీకి ఐక్యరాజ్యసమితి ఇచ్చిన ర్యాంక్ పై బోలెడంత చర్చ
By: Tupaki Desk | 7 Jun 2018 4:43 AM GMTకొన్ని వార్తలు చదివినప్పుడు.. నిజమే? అన్న భావన కలుగుతుంది. అదే సమయంలో మరికొన్ని వార్తలు చదివినంతనే.. ఏందిది? ఏం తెలుసని ఇలా రాశారు? అన్న క్వశ్చన్ మార్క్ చాలామంది ముఖాల మీద వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పేది కూడా ఆ కోవకు చెందిందే.
అంతర్జాతీయ సంతోష స్థాయిల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఏడాదితో పోలిస్తే ఒక్కసారిగా 30 స్థానాలు పైకి వచ్చినట్లుగా వెల్లడైంది. గత ఏడాది 74వ స్థానంలో ఉన్న ఏపీ తాజాగా 44 స్థానానికి చేరుకున్నట్లుగా చెబుతున్నారు. సస్టెయినబుల్ డెవలప్ మెంట్ ఇండెక్స్ లో ఏపీ మెరుగైన స్థానానికి చేరుకున్నట్లుగా చెబుతున్నారు.
ప్రజల్లో సంతోషం.. సంతృప్తికర స్థాయిల్ని పెంచేందుకు ఏపీ సర్కార్ తీసుకున్న పలు చర్యల కారణంగా ఇది సాధ్యమైనట్లుగా రిపోర్ట్ చెబుతోంది. ఇదంతా చూసినప్పుడు పలు అనుమానాలు రావటం ఖాయం. ఇంతకీ అంతర్జాతీయ స్థాయిలో హ్యాపీనెస్ ఇండెక్స్ కు కొలమానంగా ఏం తీసుకుంటారు? అన్న ప్రశ్నకు.. సమాధానంగా ఐదు అంశాలుగా చెబుతారు.
సామాజిక మద్దతు.. ఆదాయ స్థాయిలు.. అవినీతిరహితం.. అభివృద్ది.. జీవనానందం లాంటి అంశాల్ని ప్రాతిపదికన ర్యాంకులు ఇస్తారని చెబుతున్నారు. అయితే.. క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎలా ఉన్నారు? అనే కంటే.. ప్రభుత్వ నివేదికల ఆధారంగా ఈ ర్యాంకుల్ని డిసైడ్ చేస్తారని చెబుతున్నారు. ఏపీలో అవినీతి ఏ స్థాయిలో ఉందో ఇటీవల వెల్లడైన గణాంకాలు స్పష్టం చేస్తున్న వేళ.. అవినీతిరహితంగా ఉన్నందుకే ర్యాంకులు ఇస్తున్నట్లుగా ఐక్యరాజ్య సమితి రిపోర్ట్ చెప్పటం చూస్తే.. ఇప్పుడా సంస్థ మాటల మీదా అనుమానం రాక మానదు. నిధుల లేమితో కిందామీదా పడుతున్న ఏపీలో అభివృద్ధి అన్నది ఎంతన్నది అందరికి తెలిసిందే. అలాంటిది.. ఏపీలో అభివృద్ధి.. అవినీతి రహితం ఆధారంగా అంతర్జాతీయ స్థాయిలో ఏపీ స్థానం మెరుగైందన్న ప్రకటనలు ఇప్పుడు సరికొత్త సందేహాలకు తావిచ్చేలా ఉన్నాయని చెప్పక తప్పదు.