Begin typing your search above and press return to search.
నిత్యం జగన్ సర్కారుపై సూటిపోటి మాటలనే వారికి ఈ ఘనత కనిపించదే?
By: Tupaki Desk | 21 Feb 2022 4:57 AM GMTతెల్లారి లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు అదే పనిగా ఏపీలోని జగన్ సర్కారుపై విమర్శలు చేసే వారు తక్కువేం కాదు. నిత్యం అప్పులు తేవటం.. సంక్షేమ కార్యక్రమాల పేరుతో వేలాది కోట్ల రూపాయిల్ని పప్పు బెల్లాల మాదిరి పంచేయటం మినహా జగన్ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదన్న విమర్శ ఉంది. అంతేకాదు.. తమను వ్యతిరేకించే రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసి హింసకు గురి చేయటం.. కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. ఈ వాదన ఇలా ఉంటే.. జగన్ సర్కారు హయాంలో సాధిస్తున్న ఘనతల్ని ఘనంగా చాటి చెప్పే ప్రయత్నం వైసీపీ నేతల్లో కనిపించదనే చెప్పాలి.
తాజాగా ఒక ఘనతను సాధించింది ఏపీ. దాదాపు రెండున్నరేళ్ల క్రితం దేశంలోని రాష్ట్రాల్లో షురూ చేసిన టెలి మెడిసిన్ లో ఏపీ అగ్రభాగాన నిలిచింది. చాలా రాష్ట్రాలు ఏపీ సాధించిన ఘనతకు దరిదాపుల్లో కూడా రాని పరిస్థితి. దేశ వ్యాప్తంగా ఈ- సంజీవని టెలిమెడిసిన్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 2.43 కోట్ల కన్సల్టేషన్లు చేపడితే.. అందులో ఒక్క ఏపీ నుంచే 1.02 కోట్ల కన్సల్టేషన్లు చేయటం చూసినప్పడు ఏపీ ప్రభుత్వం అనుసరించిన విధానాల్ని అభినందించాల్సిందే.
ఈ-టెలీమెడిసిన్ కోసం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని వైద్య కళాశాలల్లో 13 హబ్ లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయటంతోపాటు.. వీటిని స్టేట్ లోని 1145 పీహెచ్ సీలతో పాటు.. వైఎస్సార్ విలేజ్ క్లినిక్ లకు అనుసంధానం చేశారు.
స్మార్ట్ ఫోన్ ఉన్న వారంతా ఇంటి నుంచి టెలీ మెడిసిన్ పొందేలా చేశారు. దీంతో.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ.. కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే.. ఏపీనే అత్యధిక కన్సల్టేషన్ ను పొందిన రాష్ట్రంగా ముందు వరుసలో నిలిచింది.
దేశ వ్యాప్తంగా అత్యధిక టెలీ మెడిసిన్ కన్సల్టేషన్ లో ఏపీ మొదటి స్థానంలో నిలిస్తే.. రెండో స్థానంలో కర్ణాటక నిలిచింది. మొదటి స్థానంలో ఉన్న ఏపీ 1.02 కోట్ల కన్సల్టేషన్లు చేస్తే.. రెండో స్థానంలో నిలిచిన కర్ణాటక 37.72 లక్షల కన్సల్టేషన్లు చేయటం చూస్తే.. ఈ గ్యాప్ ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.
మూడో స్థానంలో పశ్చిమ బెంగాల్ 20.89 లక్షలు.. తమిళనాడులో 17.87 లక్షలు.. ఉత్తరప్రదేశ్ 16.28 లక్షలు.. బిహార్ 7.37 లక్షలు కన్సల్టేషన్లు ఇచ్చాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. టాప్ 10 స్థానాల్లో తెలంగాణ రాష్ట్రం లేకపోవటం.
దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న టెలీ మెడిసిన్ లో ఈ ఏడాది మార్చి నాటికి రోజుకు 2 లక్షల కన్సల్టేషన్లకు ఏపీ చేరుకోనుంది. ఈ ఏడాది చివరి నాటికి రోజుకు 5 లక్షల కన్సల్టేషన్లకు చేరుకోవాలన్న లక్ష్యంతో ఏపీ సర్కారు పని చేస్తోంది.
అదే జరిగితే.. అనారోగ్యంతో ఉన్న వారు దవాఖానా వరకు రాకుండా.. ఎంచక్కా ఇంట్లోనే ఉండి వైద్య సేవల్ని అందుకునే వీలు కలుగుతుంది. ఇంతకూ ఈ ఘనతను జగన్ సర్కారు ఎలా సాధించిందన్నది కీలకం. ఈ విషయానికి వెళితే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.
ఈ - సంజీవిని ఓపీడీ యాప్ నను ఏపీలో 85,351 మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ సేవలకు సంబంధించి స్మార్ట్ ఫోన్లు వినియోగించటం తెలియని వారు.. స్మార్ట్ ఫోన్లు లేని వారి అవగాహన కోసం రాష్ట్రంలోని 42 వేల మంది ఆశా వర్కర్లకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లను ఇచ్చింది. వీటిని రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 13 టెలీ మెడిసిన్ హబ్స్ తో అనుసంధానం చేసింది.
దీన్ని మరింత పెంచేందుకు మరో 14 చోట్ల హబ్స్ ను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో హబ్ లో ఇద్దరు జనరల్ మెడిసిన్.. గైనకాలజీ.. పీడియాట్రిక్స్.. కార్డియాలసీ స్పెషలిస్టులు ఉండనున్నారు. మొత్తంగా చూస్తే.. రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయటం లాంటి వాటినే కాదు.. ప్రజలకు అందాల్సిన సేవల విషయంలోనూ జగన్ సర్కారు ముందే ఉందన్న భావన తాజా ఉదంతాన్ని చూస్తే అర్థం కాక మానదు.