Begin typing your search above and press return to search.
నిండా ముంచిన కరోనా..ఏపీకి రూ.6 వేల కోట్ల నష్టం!
By: Tupaki Desk | 18 April 2020 2:30 PM GMTముందే ఆర్థిక లోటుతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ ను కరోనా వైరస్ భారీగా దెబ్బతీసింది. ఆదాయ పరంగా ఆ వైరస్ తీవ్ర నష్టం చేకూర్చింది. మార్చి 22వ తేదీ నుంచి విధించిన లాక్ డౌన్ తో పెద్ద ఎత్తున రాష్ట్రం ఆదాయం కోల్పోవడంతో ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. దీని ప్రభావంతో ఏకంగా రూ.6 వేల కోట్ల నష్టం వాటల్లిందిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా నెలకు అంత పెద్దమొత్తంలో రాష్ట్రం ఆదాయం కోల్పోవడం పరిస్థితి తీవ్రత ఏమిటో చెబుతోంది. ఆ నష్టం కూడా కేవలం ప్రత్యక్ష పన్నుల రూపంలో మాత్రమే. పరోక్ష పన్నులతో కూడా కలిపి చూస్తే ఈ నష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్రానికి జీఎస్టీ వసూళ్లు ఒక్క పైసా కూడా లేదని, మొత్తం సున్నా అని ఆర్థిక మంత్రి తెలిపారు.
ఇప్పటికే ఆర్థిక లోటుతో సతమతమవుతుండగా తాజా రెవెన్యూ లోటుతో ప్రస్తుతం రాష్ట్రం కోలుకోవడం చాలా కష్టమని మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో జీఎస్టీ వసూళ్లు సున్నా ఉండగా - పెట్రోల్ - ఎక్సైజ్ నుంచి వ్యాట్ నామమాత్రంగా వసూలవుతోంది. ఎందుకంటే అంతగా విక్రయాలు లేవని పేర్కొన్నారు. పరోక్ష పన్నుల ద్వారా వచ్చే రెవెన్యూ లోటు మరింత ఎక్కువగా ఉందని, ఉత్పత్తి, సేవలు ఆగిపోవడంతో పరిశ్రమలు - ప్రైవేటు సంస్థలు దారుణంగా దెబ్బతిన్నాయని వెల్లడించారు.
వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ లో రోజుకు రూ.165 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం మూడంటే మూడే కోట్లు అందుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వమే మద్యం విక్రయిస్తుండగా లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. వాహనాల రాకపోకలు తగ్గిపోవడంతో పెట్రోల్ బంకులకు ఆదాయం అంతగా ఉండడం లేదు. దీంతో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఇక్కడే భారీగా తగ్గిపోతోంది.
ప్రస్తుతం ఇప్పటికే ఉన్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు కొత్తగా లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కోల్పోయి - జీవించలేని పేదలకు రూ.వెయ్యి ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తోంది. దీనికోసం రూ.1,300 కోట్లు కేటాయించాల్సి వచ్చింది. ఇక తెల్ల రేషన్ కార్డుదారులకు నిత్యావసరాలు అందించేందుకు అదనంగా రూ.1,400 కోట్లు కేటాయించారు. ఈ విధంగా ఉన్న ఆదాయం కోల్పోగా కొత్తగా సంక్షేమ కార్యక్రమాలు పెరగడం రాష్ట్రానికి తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. తెలంగాణ లో మాదిరి బాండ్ల విక్రయాలు వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత కొంత ఆర్థిక పరిస్థితి కుదుట పడేలా పరిణామాలు కనిపిస్తున్నాయి.