Begin typing your search above and press return to search.
షాకింగ్: వీధుల్లోకి వచ్చిన కరోనా గుర్రం ఇదీ
By: Tupaki Desk | 31 March 2020 8:50 AM GMTకరోనా వైరస్ దేశంలో విశృంఖలంగా వ్యాపిస్తోంది. జనాలకు ఎంత అవగాహన కల్పించినా ఇంకా నిత్యావసరాలు, కూరగాయల వద్ద గుమిగూడుతూనే ఉన్నారు. కరోనా ప్రజల్లో ఎన్నో రకాల భయాలున్నాయి. అందుకే తాజాగా ఏపీ పోలీసులు వినూత్నంగా ఆలోచించారు.
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఒక తెల్లటి గుర్రానికి కరోనా వైరస్ ను ముద్రించి రోడ్డుమీదకు తీసుకొచ్చాడు. ఈ కరోనా గుర్రం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇది చూసిన చాలా మంది జనాలకు గుర్రానికి కరోనా సోకిందా అని భయపడ్డారు. గుర్రంపై ఈ కరోనా గుర్తులు చూసి గబారా పడ్డారు. కరోనా గుర్రమా అంటూ దగ్గరకు కూడా వెళ్లలేదు. కానీ కరోనా వైరస్ పెయింటింగ్ ను గుర్రంపై వేశారని పోలీసులు తెలిపారు. దీన్ని ఊరంతా తిప్పి అవగాహన కల్పించామన్నారు. ప్రజల్లో వైరస్ పై అవగాహన పెంపొందించేందుకు ఇలా గుర్రానికి పోలీసులు పెయింటింగ్ వేసి తిప్పడం అందరినీ ఆశ్చర్య పరిచింది.
కరోనా గుర్రం కాదని తెలియడంతో ప్రజలంతా పోలీసుల చొరవను అభినందించారు. మంచి ఆలోచన అని మెచ్చుకున్నారు.